
ఇకపోతే ఇప్పటికే సుడిగాలి సుదీర్ మూడు సినిమాలను పూర్తి చేసి నాలుగవ సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఆఫర్లు కూడా రావడంతో ఆయన తన కెరీర్ మొదలుపెట్టిన జబర్దస్త్ షోకే గుడ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు సినిమాలతోనే తన జీవితాన్ని గడిపేస్తున్నారు.. ఇప్పుడు మల్లెమాల లో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలలో ఎవరో ఒకరు సుదీర్ ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు సుధీర్ వెళ్లిపోయిన తర్వాత మాత్రం.. ఆయన స్థానాన్ని హైపర్ ఆది ఆక్రమించాడనే చెప్పాలి. ఇప్పుడు హైపర్ ఆది మల్లెమాల టీం లో నంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నారు..
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా హైపర్ ఆదికి ఒక ప్రశ్న ఎదురవగా.. సుధీర్ ఒకవేళ తిరిగి మల్లెమాలకు రీయంట్రి ఇస్తే ఆయన ప్లేస్ ని ఆయనకి ఇచ్చేస్తారా అని ఆ యాంకర్ అడగ్గా.. దానికి ఆది సమాధానం చెబుతూ కేవలం సుదీర్ అనే ఒక వ్యక్తి వల్లనే మల్లెమాలకు పేరు రాలేదు కదా.. అందరం కలిసి సుధీర్ అన్న చుట్టూ ఉండి ఆయనకు పేరు వచ్చేలా మేము చేసాము.. ఇక ఆయన మీద మేము వేసే పంచ్ ల వల్లే ఆయనంత ఫేమస్ అయ్యాడు. మేము లేకపోతే ఆయన ఏమయ్యేవాడో అంటూ సమాధానం ఇవ్వడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.