తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఈమె జబర్దస్త్ తో భారీ క్రేజీ ను అందుకుంది.. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల ద్వారా అనసూయ పాపులారిటీ సంపాదించుకోవడంతో పలు సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంది.. అనసూయ కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించింది.. అప్పుడప్పుడు కూడా సోషల్ మీడియాలో చేసిన కామెంట్ల వల్ల దారుణంగా ట్రోల్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఇటీవలే అనసూయ బుల్లితెరకు దూరం అయ్యి వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. పలు వివాదాల వల్ల అనసూయ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు తాజాగా మరొకసారి ట్రోలర్ని కావాలని గెలికినట్టుగా తెలుస్తోంది.ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగేటువంటి ప్రశ్నలకు సైతం ఆన్సర్లను ఇస్తూ ఉంటుంది.


మీ గురించి ట్రోల్స్ చేసే వారిపట్ల మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న అనసూయ కి సైతం ఎదురుగా..? అందుకు అనసూయ సమాధానాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసే వారిని ఏకంగా చీడపురుగులతో పోల్చింది.. ట్రోలర్స్ కూడా అలాంటి వారే అంటూ తెలియజేయడంతో పెను దుమారం రేపులా చేసింది అనసూయ.. అంతేకాకుండా ఆ కంపు మనకి అంటకూడదు కదా అందుకే అలాంటి వారి గురించి నేను మాట్లాడడం టైం వేస్ట్ అంటూ కూడా ట్రోలర్ల పైన తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది అనసూయ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ చేసిన కామెంట్లు సైతం సంచలనంగా మారుతున్నాయి.. అనసూయ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: