బిగ్ బాస్ షో అనేది అన్ని ప్రాంతాలలో కూడా బాగానే పాపులారిటీ అందుకుంది. ఇప్పటివరకు ఎన్ని సీజన్లు వచ్చినా కూడా జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ రియాలిటీ షో సైతం సైతం బాగానే కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. తెలుగులో ప్రస్తుతం 7వ సీజన్ పూర్తి అయింది.. హిందీలో అయితే 17వ సీజన్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది 18 వ సీజన్ మొదలు కాబోతోంది. ఇప్పటికి అందుకు సంబంధించిన పనులు కూడా ఒక్కొక్కటిగా బిగ్ బాస్ షో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.


అయితే ఈసారి షో కోసం హోస్టుగా సల్మాన్ ఖాన్ నే ఎంపిక చేసే విధంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఒప్పో ఎపిసోడ్ కి దాదాపుగా రూ.15 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే వారానికి రెండు ఎపిసోడ్లకు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొదట 2010 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ వారానికి రూ.2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునే వారట. ఆ తర్వాత సీజన్ కి కూడా అలాగే తీసుకున్నారు కానీ ఏడవ సీజన్ వచ్చేసరికి ఈ రెమ్యూనరేషన్ రెట్టింపు అయ్యిందట.

ఎనిమిదవ సీజన్ కి రూ .6కోట్లు 9వ సీజన్ కి రూ.10 కోట్ల రూపాయలు.. ఇలా మొత్తానికి పెంచుకుంటూ 17వ సీజన్ కి రూ .15 కోట్లకు పైగా వారానికి తీసుకుంటున్నారట సల్మాన్ ఖాన్.. ఇలా సల్మాన్ ఖాన్ సీజన్ మొత్తం పూర్తి అయ్యేసరికి దాదాపుగా రూ.300 నుంచి 350; కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత పెంచినా కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు సల్మాన్ ఖాన్ కి ఇచ్చే విధంగానే మక్కువ చూపుతున్నారట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాలీవుడ్ లో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: