జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి వారిలో ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుదీర్ తో పాటు గెటప్ శ్రీను కూడా ఒకరు. వీరి ముగ్గురు మంచి స్నేహితులనే సంగతి కూడా తెలిసిందే.. సుధీర్, గెటప్ శ్రీను ఇద్దరు కూడా సినిమాలలో బిజీగా ఉన్నారు. ఆటో రాంప్రసాద్ మాత్రం జబర్దస్త్ లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. పంచులతోనే ఆటో రాంప్రసాద్ గా పేరు సంపాదించారు. ఆటో రాంప్రసాద్ కు అత్యంత స్నేహితులలో టాలీవుడ్ టాప్ రైటర్ బెజవాడ ప్రసన్న కూడా ఒకరట.. ఈయన నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సినిమాలకు రైటర్ గా పనిచేశారు..ఆటో రాంప్రసాద్ తాను ఒకే రూమ్లో ఉండేవారమని ఆటో రాంప్రసాద్ తనకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. జోష్ తర్వాత రాంప్రసాద్ కు అవకాశాలు లేకపోవడంతో తన సొంత ఊరు వైజాగ్ వెళ్లిపోయి సెటిల్ అవ్వాలనుకున్నారు.. అక్కడ మెడికల్ రిప్రజెంట్ గా పనిచేశారని తెలిపారు.. ఒకరోజు తాను రాంప్రసాద్ కి ఫోన్ చేసి ఇక్కడ ఉండలేకపోతున్నాను ఇంటికి వెళ్లాలనిపిస్తోందంటూ చెప్పారట. దీంతో రాంప్రసాద్ తాను బయటికి వచ్చి తప్పు చేశాను నువ్వు అలా చేయకంటూ అవసరమైతే తన ఇల్లు అమ్మ అయినా సరే తనకు డబ్బులు ఇస్తానని ధైర్యం చెప్పారని ప్రసన్నకుమార్ తెలిపారు.


అలా తనకు రాంప్రసాద్ ప్రతి నెల కూడా కొంత డబ్బులు పంపేవారని దీంతో తను ఇండస్ట్రీలో సెటిల్ అవుతానని నమ్మకం రాంప్రసాద్ కి ఉండేదని ఆ నమ్మకమే తనని ఇండస్ట్రీలో నిలబెట్టింది అంటూ తెలిపారు. అయితే ఒక రోజు రాంప్రసాద్ పుట్టినరోజు ఫోన్ చేసి తనని తిరిగి మళ్ళీ హైదరాబాద్ కి రమ్మని తనను చూసుకొనే బాధ్యత నాదే అంటూ ప్రసన్నకుమార్ చెప్పడంతో అప్పటి నుంచి తాను చేసే సినిమాలలో ఆటో రాంప్రసాద్ కి పలు రకాల క్యారెక్టర్లు ఇస్తూ ఉండేవారట. ప్రస్తుతం డైరెక్టర్గా కూడా ప్రసన్నకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆటో రాంప్రసాద్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ప్రసన్నకుమార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: