
అమరదీప్, అర్జున్ అంబటి వంటివారు పుష్ప లుక్ లో అద్భుతంగా కనిపించారు. పుష్ప మొదటి భాగం గెటప్ అమర్దీప్ కు బాగా సూట్ అయింది. అర్జున్ పుష్ప 2 గెటప్ లో కూడా కనిపించారు. సీరియల్ నటి దీపిక రంగరాజు శ్రీవల్లి పాత్రలో కనిపించింది. పుష్ప2 లో రష్మికకు వివాహమైన తర్వాత పాత్రలో మాత్రం సుహాసిని నటించింది. అర్జున్ అంబాటి తో ఫీలింగ్స్ వస్తున్నాయి సామి అంటూ సుహాసిని రీక్రియేట్ చేసినటువంటి సీన్ బాగా ఆకట్టుకుంటున్నది. పుష్ప ఫ్రెండ్ క్యారెక్టర్లు నూకరాజు నటించారు.
మరొకవైపు రోహిణి అనసూయ పాత్రలో నటించింది. సునీల్ మంగళం శీను గెటప్ పాత్రలో ఇమ్మానుయేల్ నటించారు.. ఇక మంగళం శ్రీను మీద ఎక్కి మరి అనసూయ గొంతు కోసే సీన్ కామెడీగా చిత్రీకరించారు. ప్రోమో అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా కనిపిస్తోంది. పూర్తి ఎపిసోడ్ కావాలి అంటే ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కాబోతున్నది. పుష్ప చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప-2 లో కూడా తన యాక్టింగ్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగం జాతర సీన్స్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.