
ఇటీవలే యాంకర్ శివతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేసింది. అలాగే టాలీవుడ్ లో కమిట్మెంట్ల పైన కూడా స్పందిస్తూ ఇప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే సమస్య చాలా ఉన్నదని తెలిపింది. అన్ని రంగాలలో కూడా ఇది పాకిపోయిందని కొందరైతే హీరోయిన్లను ఈజీగా కమిట్మెంట్స్ అడిగేస్తూ ఉన్నారని వెల్లడించింది. అలాగే వారు అడిగే విధానం కూడా ఇలా ఉంటుంది అంటూ తెలిపింది తేజస్వి.
ముందుగా పరిచయం చేసుకొని ఫస్ట్ చేతులను తాగుతూ ఉంటారు.అలా వచ్చిన ప్రతిసారి కూడా తాకుతూనే ఉంటారు.దీంతో వారి మధ్య క్లోజ్ నెస్ కూడా పెరగడంతో కమిట్మెంట్లు అడుగుతారని తన కెరియర్ ప్రారంభంలో కూడా తనకి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని సినిమా ఆఫర్ల కోసం వెళితే సాయంత్రం డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ తో డిన్నర్ ఉంటుందని చెప్పేవారని.. ఒంటరిగా రమ్మనే వారు.. దీంతో వారి దురుద్దేశం ఏంటో అర్థం చేసుకొని వెళ్లకుండా ఉండేదాన్ని అంటూ తెలిపింది తేజస్వి మదివాడ. ఇలాంటి విషయాలలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తోంది. ప్రస్తుతం తేజస్వి మదివాడ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.