
ఈ కారు బెంజ్ 4 మ్యాటిక్ అన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని ధర సుమారుగా రూ .1.50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. దీంతో ఇంత ధర పెట్టి ఈ కారు కొనడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అభిమానులు మాత్రం ఆమెకు కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఒక రెండు నెలల క్రితం సోనియా బెంజ్ కార్ ను కూడా కొనుగోలు చేసింది. అప్పుడు కూడా ఇలాగే పూజా కార్యక్రమాలు చేయించి మరి తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి షేర్ చేస్తూ దేవుడు ప్లాన్ ఎప్పుడూ కూడా బెస్ట్ గానే ఉంటుంది అంటూ తెలియజేస్తోంది. ప్రయాణం కష్టంగా ఉన్నప్పటికీ కూడా దేవుడిని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు అంటూ ఫోటోలకు క్యాప్షన్ జోడించింది.
విరూపాక్ష సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా నటించింది సోనియా. ఆ తర్వాత ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రంలో కూడా లేడీ కానిస్టేబుల్ గా నటించింది. ఢీ షో వంటి ప్రోగ్రామ్స్ లలో కూడా సందడి చేసిన సోనియా ఒకవైపు వెండి ధర మరొకవైపు సోషల్ మీడియాతో బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మడు మరిన్ని సినిమా అవకాశాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.