
అసలు విషయంలోకి వెళ్తే రోహిణి ఒక లగ్జరీ విల్లా కొనుగోలు చేసిందని అది కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని విలువ సుమారుగా రూ.2 కోట్ల రూపాయల లోపు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే రోహిణి ఈ స్థాయికి ఎదగడం వెనక కూడా చాలా కష్టం ఉందని అభిమానులు తెలియజేస్తూ ఆమెకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు.
ఒకప్పుడు చాలా చిన్న ఇంట్లో ఉన్న రోహిణి బిగ్ బాస్ కు రెండుసార్లు వెళ్ళింది.. అలా 20 లక్షల వరకు వచ్చిందట..అలా వచ్చిన డబ్బులను కూడా దాచుకొని , అటు జబర్దస్త్, ఇటు సినిమాలలో వచ్చిన డబ్బులతో సొంత ఇంటిని నిర్మించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిణి అటు వరుస సినిమాలతో పాటు, బుల్లితెర ప్రోగ్రామ్స్ తో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇలా అన్నిటితో పాటు యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా కొంతమేరకు బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది రోహిణి. మరి లగ్జరీ హౌస్ రోహిణి కొనిందని వార్తలపై ఎంత నిజం ఉందో రోహిణి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.