
అంతేకాకుండా ఆ నటి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు నేటిజన్స్. బిగ్ బాస్ 9 కి సంబంధించి సన్నహాలు ఇంకా స్టార్ మా నిర్వాహకులు మొదలు పెడుతున్నారని అందులో కొంతమంది పేర్లు ఉన్నట్లుగా వైరల్ గా మారుతున్నాయి.. అందులో ఒకరు చిట్టి అలేఖ్య పికిల్స్ లో ఒకరైన రమ్య.. ఇప్పుడు మరొకరీ పేరు వినిపిస్తోంది. ఆ నటి ఎవరో కాదు కల్పికా గణేష్.. ఈ మధ్యకాలంలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది.
సినిమాలలో సహాయక పాత్రలలో నటిస్తూ బాగానే పేరు సంపాదించిన నటి కల్పికా గణేష్ నిరంతరం వివాదాలలో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపించేలా చేస్తోంది. ఇటీవలే పబ్బులో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈమె పేరు మరొకసారి వినిపిస్తోంది. అందుకే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. ఒకవేళ ఇదే ఫాలోయింగ్ గనుక కొనసాగితే కల్పిక కచ్చితంగా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి అంత అనుకుంటున్నట్టుగా బిగ్ బాస్ 9 సీజన్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. అలాగే గత కొంతకాలంగా బర్రెలక్క పేరు, జబర్దస్త్ ఇమ్మాన్యూయేల్ , శివకుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.