తెలుగు బుల్లితెరపై తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేటువంటి జబర్దస్త్ కమెడియన్లలో గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుదీర్ టీమ్ కూడా ఒకటి. అయితే వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన స్కిట్లకు హై లెవెల్ లో క్రేజ్ ఉండేది. జబర్దస్త్ లో తమకంటూ ఒక పేరు సంపాదించిన ఈ కమెడియన్స్ ప్రస్తుతం రామ్ ప్రసాద్ ఒక్కడే జబర్దస్త్ లో కంటిన్యూ అవుతున్నారు. ఈ సందర్భంలో అటు గెటప్ శ్రీను, సుధీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు రామ్ ప్రసాద్.


సుడిగాలి సుదీర్ తన కెరియర్ కారణం వల్ల జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చారని అలాగే గెటప్ శ్రీను కూడా సినిమాలలో మంచి మంచి అవకాశాలు రావడం వల్ల జబర్దస్త్ నుండి బయటికి వచ్చారని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. సుడిగాలి సుదీర్ ప్రస్తుతం సినిమాలకు హీరోగా గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ , సర్కార్ సీజన్ 5, డ్రామా జూనియర్స్ వంటి వాటికి హొస్టుగా చేస్తున్నారు. ఇటివలె సర్కారు సీజన్5 లో 7 వ ఎపిసోడ్ కి ఆటో రామ్ ప్రసాద్, సన్ని, గెటప్ శ్రీనుతో కలిపి కొంతమంది జబర్దస్త్ కమెడియన్సు వచ్చారు.


ఈ షోలో పాల్గొన్న రామ్ ప్రసాద్ ఎమోషనల్ గా మాట్లాడారు. జబర్దస్త్ లో మనం సుమారుగా 10 ఏళ్ళు కలిసి పని చేసామని.. కాని ఒకరోజు మీరిద్దరూ లేకుండా స్కిట్ చేయడానికి స్టేజ్  పైకి వెళ్లాను ఆ రోజు తన గుండె బద్దలైనట్లుగా అనిపించింది.. మీరు లేకుండా స్కిట్ చేయాలంటే బాధగా ఉంది. ఎప్పటికైనా మళ్లీ మనం ముగ్గురం కలిసి కామెడీ షో చేయాలని ఉందని తెలిపారు.ఇందుకు సుధీర్, శ్రీను, సన్నీ ఎమోషనల్ గా మాట్లాడారు. అభిమానులు కూడా అందరూ కలిసి మళ్ళీ స్కిట్స్ చేయాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: