తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటి షో ఈసారి తొమ్మిదవ సీజన్ మొదలు కాబోతోంది. ఈసారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే బిగ్ బాస్ 9 పై అంచనాలు పెంచేసేలా ప్రోమోను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయడంతో ఈసారి విభిన్నంగా ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సుమారుగా 40 మందికి పైగా ఫైన లైజ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి బిగ్ బాస్ ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షను నెగ్గిన వారిని షోలో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టేలా చూస్తున్నారట.


ఇందుకు సంబంధించి తాజాగా బిగ్ బాస్ ప్రోమోని విడుదల చేశారు. టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్, నాగార్జున మధ్య సంభాషణ ఆడియన్స్ ని మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది. బిగ్ బాస్ షో కి వెళ్లడానికి వచ్చావా .. అంటూ నాగార్జున అడగగా కాదు బిగ్ బాస్ నే ఏలడానికి వచ్చాను అంటూ వెన్నెల కిషోర్ సెటైర్ వేస్తారు.. నాగార్జున అది నీ వల్ల కాదులే ఈసారి చాలా టఫ్ గా ఉంటుంది.. రఫ్ గా ఉంటుంది అంటు తెలిపారు. ఈసారి మాత్రం బిగ్ బాస్ డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ ఒక చిన్నపాటి జలక్ ను ఇచ్చారు వెన్నెల కిషోర్ కి నాగార్జున.


దీంతో వెంటనే నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుతా అంటూ వెన్నెల కిషోర్ అనడంతో బిగ్ బాస్ నే మార్చేశా అంటూ నాగార్జున భారీ ట్విస్ట్ ఇచ్చారు.. ఇలా నాగార్జున, వెన్నెల కిషోర్ మధ్య సరదాగా సాగిపోయే ఈ బిగ్ బాస్  ప్రోమో మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అనే డైలాగుతో నాగార్జున ప్రోమో ముగిస్తుంది. మరి ఏ మేరకు బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఎలాంటి ప్లాన్లు వేశారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: