అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 4జీ డేటా యూసేజ్ వంటి ఆఫర్లతో రిలయన్స్ jio నెట్‌వర్క్‌ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో జియో నెట్‌వర్క్‌లోకి మారుతోన్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది జియోనే వాడుతున్నారు. ఇలా టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తోంది జియో.  జియో, జియో ఫోన్ వినియోగదారులు తమ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి మై జియో యాప్, ఐవీఆర్ సర్వీస్, అధికారిక జియో వెబ్ సైట్ వంటి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మైజియో యాప్ ద్వారా జియో బ్యాలెన్స్‌ను తెలుసుకోవ‌చ్చు.

 

అందుకు మీ స్మార్ట్‌ఫోన్‌లో మైజియో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, మీరు మీ జియో బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఫోన్ ల్లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 10.0 లేదా ఆపైన వెర్షన్లలో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ పనిచేస్తుంది. ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో మైజియో అప్లికేషన్ ఓపెన్ చేసి, సిమ్‌ ద్వారా లేదా ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అయిన తర్వాత, హోమ్ స్క్రీన్‌లో మీ జియో బ్యాలెన్స్, వాలిడిటీ కనిపిస్తాయి. 

 

అందుబాటులో ఉన్న ఉచిత మెసేజులు, డేటా, వాయిస్ కాల్స్ వివరాలను తెలుసుకునేందుకు వాలిడిటీ కింద ఉన్న డిటైల్స్ బటన్‌ నొక్కండి. ఆ తర్వాత మై-ప్లాన్స్ ఆప్షన్ నొక్కండి. ఇది అందుబాటులో ఉన్న మెసేజులు, డేటా, వాయిస్ కాల్స్ తో సహా మీ వ్యాలిడిటీ వివరాలను చూపిస్తుంది. ఇక  మీరు మీ రోజువారీ డేటా కోటాలో మిగిలిన బ్యాలెన్స్‌ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, డేటా, వాయిస్ కాల్, మెసేజులతోపాటు, వైఫై పాక్స్ వినియోగాన్ని కూడా, హోంస్క్రీన్ మీద ఉన్న చెక్-యూసేజ్ ఆప్షన్ ద్వారా చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: