ప్రముఖ చైనా దేశం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ మిడ్ రేంజ్ ఫోన్ హానర్ x10 5g స్మార్ట్ ఫోన్ ఇటీవల చైనాలో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఫోన్ ని 5g సపోర్ట్ త్రిపుల్ రియర్ కెమెరా, అక్టా కోర్ ప్రాసెసర్ తో రూపొందించడం జరిగింది. ఈ ఫోన్ వినియోగదారులకు మూడు వేరియంట్ కలర్స్ లో కి రావడం జరిగింది.

IHG

 

ఇక ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ప్రీ బుకింగ్ చైనాలో మొదలవగా... మే 26 నుంచి విక్రయాలు మొదలవుతున్నాయి.ఇక ఈ ఫోన్ ని అతి త్వరలోనే భారత్ మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ అధికారులు సిద్ధమవుతున్నారు.

IHG

ఇక ఈ హానర్‌ ఎక్స్‌10 ప్రత్యేకతల విషయానికి వస్తే ... డిస్‌ప్లే 6.63అంగుళాలు ఉంది. ప్రాసెసర్‌ హైసిలికాన్‌ కిరిన్‌ 820 , ఫ్రంట్‌ కెమెరా 16 మెగాపిక్సల్, రియర్‌ కెమెరా 40 + 8 + 2 మెగా పిక్సల్, ర్యామ్‌ 6 gb, స్టోరేజ్ 64 gb, బ్యాటరీ కెపాసిటీ 4300 mAh.

 

ఇక తాజాగా రియల్ మీ సంస్థ రిలీజ్ చేసిన రియల్ మీ నార్జ్ 10 ఓపెన్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు మార్మోగి పోయాయి. కేవలం రెండు నిమిషాల్లోనే 70000 ఫోన్లను అమ్మడం జరిగింది. మే 22వ తారీఖున రియల్ మీ 10A ఫోన్ ని రియల్ మీ సంస్థ విడుదల చేయబోతోంది. దాని ఖరీదు రూ. 8499.

 

మరింత సమాచారం తెలుసుకోండి: