సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొన్ని కోట్ల భారత ప్రజలు వాడుతున్న 59 చైనా అప్లికేషన్ లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్స్‌ను తొలగించాయి. గల్వాన్ లోయలో ఘర్షణలకు కారణమై 20 మంది జవాన్లు అమరులవడానికి కారణమైన చానా వస్తువున్నింటినీ బహిష్కరించాలని దేశవాసులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించకుంది. ఇక ఈ యాప్స్‌పై కేంద్రం నిషేదం విధించ‌డంతో..కొత్త యాప్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే చైనా యాప్స్‌ బదులుగా ఇప్పుడు చెప్పుకోబోయే యాప్ వాడేతే ఎన్నో బినిఫిట్స్ పొంద‌వ‌చ్చు. ఫొటో ఎడిటింగ్.. అడోబ్ ఫొటోషాప్, గూగుల్ స్నాప్‌సీడ్, పిక్స్ ఆర్ట్,  బీ612 వంటి వాటితో చక్కగా ఫొటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోలు, ఫైళ్లను స్కాన్ చేసేందుకు ఇప్పుడు డాక్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, అడోబ్ స్కాన్, ఫొటో స్కాన్ బై గూగుల్, మైక్రోసాఫ్ట్ లెన్స్ వంటివి వాడొచ్చు.

 

అదేవిధంగా, ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వాడాలంటే క్లోన్‌ యాప్‌, సూపర్‌ క్లోన్‌ వంటివి యాప్స్ బాగా యూజ్ అవుతాయి. ఇక‌ ఇన్నాళ్లూ మీరు బ్రౌజింగ్ కోసం యూసీ బ్రౌజర్ వాడుతున్నట్లైతే.. ఇకపై అది ఉండదు. సో.. దాని బదులు గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా వంటివి వాడొచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌... ప్రస్తుతం అందరూ వాడుతున్న జూమ్‌పై కేంద్రం నిషేధం విధించకపోయినా... దానికి ఆల్టర్నేట్‌గా గూగుల్‌ మీట్‌, స్కైప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌, సే నమస్తే వంటి యాప్స్ యూజ్ చేసుకుంటే మంచిది. మ‌రియు మొబైల్‌లో వైరస్ చేరకుండా అవాస్తా, ఏవీజీ, నార్తన్‌‌ యాంటీ వైరస్‌ వంటి యాప్‌లు యూజ్ చేసుకోవ‌చ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: