ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ రెనో 4 ప్రో సేల్ మనదేశం లో ఈరోజే ప్రారంభం అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు భలే ఉన్నాయి. ఈ ఒప్పో రెనో 4 ప్రో పూర్తి వివరాలు ఇవే.... ఈ మధ్యే లాంచ్ చేసిన రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ మన భారత దేశం లో నేడే అనగా ఆగస్టు 5వ తేదీన  ప్రారంభం అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో స్పెషల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లో ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ను ఒప్పో అందిస్తోంది. ఈ ఫోన్ కి వెనుక భాగం లో  నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఈ ఫీచర్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ ని మీరు కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా..? అయితే మీరు ఆఫ్ లైన్, ఆన్ లైన్ ఇలా ఎదో ఒక విధంగా ఈ ఫోన్ ని  కొనుగోలు చేయవచ్చు.


8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,900  మాత్రమే. స్టారీ నైట్, సిల్కీ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కొన్ని బ్యాంక్  కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభించే అవకాశం ఉంది. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లో కూడా కొనుగోలు చెయ్యవచ్చు. ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్ ను ఒప్పో అందించనుంది.  8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మోనో లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా దీనిలో ఉన్నాయి.


సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 616 సెల్ఫీ కెమెరా సెన్సార్ ను అందించారు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ 3డీ బోర్డర్ లెస్ సెన్స్ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. వైఫై 6, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్/నావిక్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మందం 0.77 సెంటీ మీటర్లు కాగా, బరువు 161 గ్రాములు.




మరింత సమాచారం తెలుసుకోండి: