ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ నోకియా రెండు ఫీచర్ ఫోన్లను కొత్తగా లాంచ్ చేసింది. అవేమిటి అంటే నోకియా 8000 4జీ, నోకియా 6300 4జీ. ఈ ఫోన్ ల గురించి ఈ మధ్య రకరకాల ప్రచారాలు జరగగా ఎట్టకేలకు అఫీషియల్ గా లాంచ్ చేసింది నోకియా. ఈ రెండు ఫోన్లూ కూడా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్‌ మీద పని చేయనున్నాయి. 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఈ రెండు ఫోన్ లలో అందించారు. ఇక ఈ రెండు ఫోన్ ల స్పెషాలిటీ పరిశీలిస్తే, ముందుగ  నోకియా 8000 4జీలో 2 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 


ఇందులో ఫ్లాష్ కూడా ఉంది. నోకియా 6300 4జీ ఫోన్ లో వీజీఏ కెమెరా అందించారు. ఈ రెండిట్లోనూ కీ ప్యాడ్‌ ను అందించారు. ఇక నోకియా 8000 4జీ ధర 79 యూరోలు అంటే మన డబ్బులో సుమారు రూ.6,900కి ఫిక్స్ చేశారు. ఈ ఫోన్ లు ఓనిక్స్ బ్లాక్, ఓపల్ బ్లాక్, టోపాజ్ బ్లూ, సిన్‌ట్రైన్ గోల్డ్ రంగుల్లో లాంచ్ అయింది. ఇక నోకియా 6300 4జీ ధర 49 యూరోలు అంటే మన డబ్బులో సుమారు రూ.4,300కి ఫిక్స్ చేశారు. సియాన్ గ్రీన్, లైట్ చార్‌కోల్, పౌడర్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


 ఈ రెండు ఫోన్లు ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనే విషయం మీద క్లారిటీ లేదు. ఈ రెండు ఫోన్లలో కైఓఎస్, డ్యూయల్ సిమ్(నానో + నానో) ఫీచర్లు ఉన్నాయి. 8000 4జీ ఫోన్ లో 2.8 అంగుళాల క్యూ వీజీఏ డిస్ ప్లే అందించారు. 6300 4జీలో 2.4 అంగుళాల క్యూ వీజీఏ డిస్ ప్లే ఉంది. ఈ రెండు ఫోన్ల లో మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు మెమరీ పెంచుకోవచ్చు. ఈ రెండు ఫోన్లలో ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఈ రెండు ఫోన్లలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: