ఏ బల్బ్ అయినా వెలుగునిచ్చేవేగా?ఇందులో స్పెషాలిటీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అవునండి.. స్మార్ట్ బల్బు ఉపయోగాలు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కళ్లు చెదిరి పోవాల్సిందే. సాధారణంగా పూర్వకాలంలో వీధి దీపాలను వాడేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఫిలమెంట్ బల్బులు వస్తే, మరి కొంతకాలానికి ఎల్ఈడీ లైట్లు వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా స్మార్ట్ బల్బులు వచ్చాయి.కాలం మారుతున్న కొద్దీ బల్బుల వాడకం పెరుగుతోంది. తయారీ సంస్థలు కూడా ఆధునికతను దృష్టిలో పెట్టుకొని, వినియోగదారులకు తగ్గట్టుగా తమదైన శైలిలో రూపొందిస్తున్నాయి.ఇప్పుడు ఈ స్మార్ట్ బల్బుల ఉపయోగాలు ఏంటో? తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ బల్బులను ఆన్ చేయాలన్నా లేదా ఆఫ్ చేయాలన్నా స్విచ్ అవసరం లేదు. మీ చేతిలో స్మార్ట్ఫోన్, అందులో ఇంటర్నెట్ తో పాటు బ్లూటూత్ కనెక్షన్ ఉంటే చాలు. సులభంగా ఈ స్మార్ట్ బల్బులను స్మార్ట్ గా ఉపయోగించుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా ఈ స్మార్ట్ బల్బులను ఆపరేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. ఉదాహరణకు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు,అనుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేశారు. ఇక ఆ సమయంలో సడన్గా లైట్లు ఆఫ్ చేయలేదని మీకు గుర్తుకొస్తుంది. ఆ సమయంలో ఎలాంటి టెన్షన్ పడకుండా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ లైట్లు ఆఫ్ చేయవచ్చు.

ఇక ఒకవేళ ఆఫీసుకు వెళ్లిన తర్వాత, మీరు సాయంత్రం ఇంటికి లేటుగా రావాల్సి వస్తే, అక్కడి నుండి మొబైల్ ద్వారా లైట్లను ఆన్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్మార్ట్ బల్బులు మన పనులను మరింత సౌలభ్యంగా మారుస్తున్నాయి.

హాలోనిక్స్ ప్రైమ్ ప్రిజమ్ స్మార్ట్ బల్బ్:
హలోనిక్స్ తయారుచేసిన ఈ బల్బులు వైఫై ద్వారా పనిచేస్తాయి. వీటిని  గూగుల్ అసిస్టెంట్, అలెక్సా ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.ఈ బల్బులను టాబ్లెట్ ద్వారా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు.

టీపీ లింక్ ఎల్బీ 100 లెడ్ స్మార్ట్ బల్బ్ :
ఈ బల్బులను మీరు ఎక్కడున్నా వైఫై ద్వారా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బల్బుల నుండి వెలువడే కాంతిని కూడా కంట్రోల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

సిస్కా 7 వాట్ల స్మార్ట్ లెడ్ బల్బ్ :
సిస్కా తయారుచేసిన ఈ బల్బు ఏకంగా 30 లక్షల కలర్లను మనకు అందిస్తోంది.కాబట్టి ఎవరికి నచ్చిన కలర్ ను వారు సెట్ చేసుకోవచ్చు.  సిస్కా  ప్రవేశపెట్టిన ఒక యాప్ ద్వారా ఈ బల్బును కంట్రోల్ చేసుకునే సదుపాయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: