కేంద్రం ప్రతి రోజూ,ఏదో ఒక విషయం మీద ఒక కొత్త విషయాన్ని చెబుతుంది. ఇప్పుడు సరికొత్తగా కొత్త కార్మిక చట్టాల పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త కార్మిక చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త కార్మిక చట్టాలు రావడం వలన వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉండనున్నాయి. అలాగే ఉచిత మెడికల్ చెకప్,బస్సు కూడా అందుబాటులోకి వుండనున్నట్లు తెలుస్తోంది. వారానికి నాలుగు పనిదినాలు అయినా కూడా ఉద్యోగులు, ఒక వారంలో 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే వారంలో నాలుగు రోజులు పని చేయాల్సి వస్తే, రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ నిర్ణయం మాత్రం కంపెనీల ఉద్యోగుల ఇష్టమని చెప్పుకొచ్చింది. కేంద్రం ఎవరి మీద ఒత్తిడి తీసుకురాదు. కంపెనీలకు ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం 2 ఆప్షన్లను మనకు అందిస్తోంది. వారంలో నాలుగు రోజులు పని చేయాలా? లేదంటే ఆరు దినాలు చేయాలా? పూర్తిగా ఉద్యోగస్తుల కంపెనీలు ఇష్టాఇష్టాల ద్వారానే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
రాబోవు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత,కంపెనీలు 4 లేదా 6 పనిదినాల కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఈ కొత్త కార్మిక చట్టం అమలు అయితే, ఉద్యోగస్తులకు తమ ఫ్యామిలీతో కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి బాగానే ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి