ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్క దిగ్గజ సంస్థలు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్నాప్డీల్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు కరోనా  కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొంతమంది రోగులు ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కొంతమంది ప్లాస్మా దాతలను పొందలేక సతమతమవుతున్నారు. అయితే ప్లాస్మా దానం చేయడానికి ఆరోగ్యవంతులు ముందుకొస్తున్నా, అది అవసరమైన వారికి అందడం లేదు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ దిగ్గజ  ఈ కామర్స్ సంస్థ  స్నాప్డీల్ "సంజీవని" అనే యాప్ ను ప్రారంభించింది. అయితే ఈ యాప్ లో ప్లాస్మా కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం.

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
ప్లాస్మా అవసరమైన రోగులు, ప్లాస్మా దానం చేయాలనే వ్యక్తులు , ఇద్దరూ  సంజీవని ప్లాట్ ఫామ్ లో నమోదు చేసుకోవాలి. ఇక వీరిద్దరూ  తమ మొబైల్ నెంబర్ ను  ఈమెయిల్ ఐడి ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ ఫామ్ దాత తన బ్లడ్ గ్రూప్, అడ్రస్ వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉన్నాడో ? లేడో? అనే సమాచారాన్ని కూడా సంజీవని యాప్ లో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత స్నాప్డీల్  లో రోగి సమీపంలో ప్లాస్మా దాత వివరాలను తెలియజేస్తుంది. అప్పుడు వారికి ఫోన్ చేసి ప్లాస్మా కోసం అభ్యర్థించవచ్చు.


ఇలాంటి సదుపాయాలు అందించడం వల్ల ప్లాస్మా దానంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు ప్లాస్మా దానాన్ని సులభంగా చేరవేయడానికి  ఈ ఫ్లాట్ ఫామ్  ను  ప్రారంభించినట్లు స్నాప్డీల్ పేర్కొంది. ఇలాంటి సమయంలో  దిగ్గజ సంస్థలు అయిన పేటీఎం, ఫేస్ బుక్ వంటి సంస్థలు వ్యాక్సిన్ ఫైండర్ పై ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్ లు  కేవలం వ్యాక్సిన్ కేంద్రంలో వ్యాక్సిన్లను అనుకోవడంలో మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ప్లాస్మా దానం చేయాలనుకునేవారు, కావాలనుకునేవారు ఈ స్నాప్డీల్ లో  సంప్రదించవచ్చని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: