శాంసంగ్ కంపెనీ త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ఎం22 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ కి సంబంధించిన లిస్టింగ్ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(ఎఫ్‌సీసీ) వెబ్‌సైట్లో కనిపించింది.ఇక ఈ శాంసంగ్ మోడల్ SM-M225FV/DS మోడల్ నంబర్‌తో ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ కూడా పొందింది. అయితే ఇక ఈ లిస్టింగ్‌లో ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ల వివరాలు తెలియలేదు.ఇక ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే లాంచ్ కానుందని మాత్రం అంచనా వేయవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉన్నప్పటికీ కేవలం 15W ఫాస్ట్ చార్జర్‌నే కంపెనీ ఫోన్‌తో పాటు అందించే అవకాశం ఉందట. ఇక ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్ అందించినా దానికి సంబంధించిన అడాప్టర్‌ను అందించకుండా శాంసంగ్ ఖర్చు ఆదా చేసుకోనుందని తెలుస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యూఎస్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఉండనుంది. ఇక ఎన్ఎఫ్‌సీ, వైఫై కనెక్టివిటీ కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే 4జీ వోల్టే, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉండనున్నాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎ22 తరహాలోనే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయని తెలుస్తోంది.ఇక ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫోన్ కి 6.4 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ యూఎస్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ కూడా పొందింది.6 జిబి ర్యామ్ తో వస్తున్న దీని ధర 25000/- దాకా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి అధికారిక సమాచారం ఏదీ తెలియలేదు. త్వరలో శాంసంగ్ సంస్థ వివరాలు వెల్లడించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: