
కరోనాను తరిమికొట్టకుండా డెల్టా వేరియంట్ అడ్డుకుంటుందని అమెరికా వైద్య నిపుణుడు వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజరీ పాసి అంటున్నారు. ఈ సందర్భంగా సైంటిస్టులు కొత్త కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అన్ని కరోనా వేరియంట్లను తట్టుకునేలా టీకాను రూపొందించే పనిలో పడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా సైంటిస్టులు యూనివర్సల్ టీకా తయారు చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. వీళ్లు ఒక హైబ్రిడ్ వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఈ సూపర్ వ్యాక్సిన్ గా పిలుస్తున్న ఈ టీకా భవిష్యత్తులో వచ్చే ఎంత పెద్ద కరోనా వేరియంట్ నైనా తట్టుకొని రక్షణ అందిస్తుందని దాని తయారీకే వారు కృషి చేస్తున్నారని సమాచారం.
ఈ వ్యాక్సిన్ను ఎలుకలపై ప్రయోగిస్తే విజయవంతం అయిందని అన్నారు. ఎలుకల్లో కరోనా వైరస్ ని అడ్డుకోవడమే కాకుండా ఊపిరితిత్తులపై ప్రభావం చూపకుండా అడ్డుకుందని తెలియజేశారు. ఈ వైరస్ రానున్న రోజుల్లో ఇలాంటి మార్పు చేసుకొని మనపై దాడి చేసిన దాన్ని అంతం చేసే ఈ విధంగా టీకాను తయారు చేస్తున్నామని తెలిపారు. మరింత అధ్యయనం తర్వాత వచ్చే సంవత్సరం మనుషులపై ప్రయోగం చేస్తామన్నారు.