ఈ ఫోన్ మనకు 90 హెడ్జెస్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు మీడియా టెక్ డైమన్షన్ 810 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 4జీ బీ ర్యామ్ , 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉన్న ఈ ఫోన్ ధర విషయానికి వస్తే రూ.19,700 వద్ద మొదలవుతుంది.6జీబీ ర్యామ్ అలాగే 128 జీబీ స్టోరీస్ వేరియంట్ ఉన్న స్మార్ట్ ఫోన్ ధర రూ.21,400 దగ్గర ప్రారంభమవుతుంది. మనకు మూడు రంగుల లో లభ్యం కానుంది. కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో కలర్ లో మనకు అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ ఈనెల 11వ తేదీ నుంచి యూరప్ లో అందుబాటులోకి రానుంది. అంటే ఈ రోజు ఉదయం ఈ మొబైల్ ను యూరప్లో గ్రాండ్ గా లాంచ్ చేశారు.
స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.6 ఇంచ్ ల పూర్తి హెచ్డీ, డాట్ డిస్ప్లే తో మనకు అందుబాటులోకి రానుంది. 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ తో పాటు 240 HZ టచ్ రెస్పాన్స్ రేటు తో మనకు అందుబాటులోకి రానుంది. అంతేకాదు డైనమిక్ విస్తరణ టెక్నాలజీని కూడా ఈ స్మార్ట్ ఫోన్లో పొందుపరిచారు. కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ అలాగే డ్యూయల్ కెమెరా రేర్ కెమెరా సెటప్ కూడా అందిస్తున్నారు. సెల్ఫీ షూటర్ విషయానికొస్తే 16 మెగాపిక్సల్ కెమెరాను పొందుపరిచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి