ప్రముఖ బ్రాండెడ్ నుంచి విడుదలైన మొబైల్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ నథింగ్ బ్రాండెడ్ నుంచి ఇప్పుడు తాజాగా మళ్లీ ల్యాప్ ట్యాప్ ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తోంది ఆ సంస్థ ఈ విషయాన్ని ఆ కంపెనీ సంస్థ సీఈవో కార్ల్ ఫేమ్ అధికారికంగా ప్రకటించారు. కంపెనీ వేర్వేరు కాన్సెప్ట్ ల మీద దృష్టి పెట్టడం వల్ల . ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ అంత మొబైల్ ఫోన్లపైనే ట్రూ వైర్లెస్ పైన ఉన్నదని తెలియజేశారు సీఈవో అయితే ఇప్పట్లో కాకపోయినా త్వరలో అయిన మనం నథింగ్ ల్యాప్ ట్యాప్ విడుదల చేసే అవకాశం ఉందని తెలియజేశారు.


ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో జరుగుతున్న సేల్స్ లో భాగంగా నథింగ్ మొబైల్ పైన భారీ ఆఫర్ ని ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ధర రూ.29,999 రూపాయలు కాగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ల ద్వారా రూ.1,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక వీటితోపాటు పలు బ్యాంకు కార్డుల ద్వారా తీసుకున్నట్లయితే అదనంగా రూ.2,750 రూపాయలు తగ్గించనున్నారు. అంటే మొత్తం మీద ఈ మొబైల్ పైన రూ.3,750 తగ్గుతుంది. దీంతో ఈ మొబైల్ రూ.26,249 రూపాయలకే లభించనుంది. ఇక అంతే కాకుండా ఎక్స్చేంజ్ ద్వారా కూడా ఈ మొబైల్ రూ.3000 తగ్గింపు ఉన్నదట.ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.12 gb ram+256 GB మెమొరీ సామర్థ్యం కలదు. మొబైల్ బ్యాటరీ విషయానికి 4500 mah సామర్థ్యం తో పాటు 33 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇక రాబోయే రోజులలో ల్యాప్ ట్యాప్ నథింగ్ బ్రాండెడ్ నుంచి పలు ల్యాప్ ట్యాప్ విడుదల చేస్తామని అది కూడా సామాన్య విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేయబోతున్నట్లు నథింగ్ సీఈవో తెలియజేశారు. పలు టెక్నాలజీ పరంగా ఉండబోతోంది అని తెలియజేశారు. రాబోయే రెండు మూడు ఏళ్లలో నథింగ్ ల్యాప్ ట్యాప్ విడుదలవుతుందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: