ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఆలోచనలో ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ అందిస్తోంది ప్రముఖ సంస్థ. అది తక్కువ ధరకే లభించే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నది. దీని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదట. అంతేకాకుండా ఈ బండికి ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదని తెలుస్తోంది.. ఈ బైక్ పేరే..URBN.. ఎలక్ట్రిక్ బైక్.. మోటోవోల్డ్ మెబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ బైక్ ని లాంచ్ చేయడం జరిగింది. దీని ధర 50వేల రూపాయలు. ఇప్పటికే ఈ బైకు సంబంధించి బుకింగ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి.


999 రూపాయలకే ఈ బైక్ ని సైతం బుక్ చేసుకోవచ్చు..URBN ఈ ఎలక్ట్రిక్ బైక్ 100కు పైగా ఫిజికల్ రిటైల్ పాయింట్లు సైతం ఏర్పాటు చేశారట.. అయితే కేవలం నాలుగైదు కలర్ల ఆప్షన్లను ఈ బైక్ అందుబాటులో ఉన్నది.. మోటో వోల్ట్ URBN ఎలక్ట్రిక్ బైక్ BIS అప్రూవ్ రిమూవబుల్ బ్యాటరీ తో పనిచేస్తుంది దీనిని ఇంట్లో అయినా సరే చార్జింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంటి బయట పార్కు చేసుకొని బ్యాటరీ చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో రెండు బ్యాటరీలు ఉంటాయట.


ఈ బైకుకి ఫెడరల్ అసిస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ బైక్ లో ఎన్నో రైడింగ్ మోడ్స్ లు కూడా ఉన్నవి ఆటోమేటిక్ రైడ్ ప్రిపరేషన్ లను ఎంపిక చేసుకోవచ్చు.. హ్యాండిల్ లాక్ సేఫ్టీ కూడా ఉంటుంది. ఈ బైకు బరువు 40 కేజీలు మాత్రమే ఉంటుంది. దాదాపుగా ఇది 120 కేజీల వరకు బరువును మోయగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ 10 సెకండ్లలో 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్ పూర్తిగా చార్జింగ్ అవ్వడానికి 4:00 సమయం పడుతుంది సింగిల్ చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. వెనుక వైపు ముందు వైపు డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఆడవారికి ఎక్కువగా ఈ బైక్ ఉపయోగపడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: