ప్రస్తుతం ఎక్కువగా అందరూ డిజిటల్ బాటనే పయనిస్తున్నారు.. మనుషులను ఎక్కువగా ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ శాసిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు రకాల మార్కెట్ సంస్థలు సరికొత్త అప్డేట్లతో స్మార్ట్ మొబైల్ ని విడుదల చేస్తూ ఉన్నారు. మనలో చాలామంది 10 మందిలో నలుగురు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త మొబైల్ ని మారుస్తూ ఉన్నారట. సరికొత్త అప్డేట్ల మొబైల్ కావాలని ఈ క్రమంలోనే వారు వాడిన పాత ఫోన్లను సైతం పక్కకు పడేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పాత మొబైల్స్ కూడా ఎన్నో రకాల వాటికి ఉపయోగపడతాయనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.


పాత మొబైల్స్ ని మనం కచ్చితంగా ఉపయోగించుకుంటే మన ఇంట్లో సిసి కెమెరాగా పని చేస్తాయట..

1). మొదట మీ పాత మొబైల్ కొత్త మొబైల్ రెండిట్లో కూడా alfred CCTV అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. పాత మొబైల్ ని సీసీ కెమెరాగా ఉపయోగించేందుకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది.

2). ఇలా స్మార్ట్ మొబైల్ లో వీటిని డౌన్లోడ్ చేసిన తర్వాత.. పాత మొబైల్ ని ఫోన్ CCTV లా కొత్త మొబైల్ మానిటర్ గా ఉపయోగించుకోవచ్చు. ఇలా మన ఇంట్లో ఏదో ఒకచోట పాత మొబైల్ ని అమర్చాలి.. ఈ మొబైల్ కి సైతం ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి.


3). సీసీటీవీ గా ఉపయోగిస్తున్న మొబైల్ కి సైతం చార్జింగ్ అయిపోకుండా కరెంటు సప్లై అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి.లేకపోతే పవర్ బ్యాంకు ను కూడా ఉపయోగించుకోవచ్చు


4). స్టోరేజ్ ను బట్టి మొబైల్ యొక్క మెమొరీ కార్డుని వారంలో కనీసం ఒక్కసారైనా క్లియర్ చేస్తూ ఉండడం వల్ల స్టోరేజ్ ఇబ్బంది ఉండదు.


5). ఇలా చేయడం వల్ల పాత మొబైల్ ని వేస్ట్ గా పడేయకుండా మన ఇంటి అవసరాల కోసం సెక్యూరిటీగా కూడా ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: