ప్రతి ఒక్కరి స్మార్ట్ మొబైల్ లో కచ్చితంగా యాప్స్ లో వాట్సప్ కచ్చితంగా ఉంటుంది.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజ్ యాప్స్ లలో వాట్సాప్ కూడా మొదటి స్థానం ఉంటుంది.. యూజర్స్ కి సైతం అవసరాలకు అనుగుణంగాని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను సైతం తీసుకువస్తూనే ఉంది వాట్సప్.. అందుకే ఈ యాప్ మంచి క్రేజ్ ఉన్నది. ఎన్నో రకాల మెసేజ్ యాప్స్ ఉన్నప్పటికీ వాట్సప్ కి మాత్రం ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు.


ఇదంతా ఇలా ఉంటే యూజర్స్ అవసరాలకు సెక్యూరిటీకి పెద్దపీట వేస్తోంది వాట్సప్.. తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ ఫిచర్ ని సైతం కస్టమర్ల కోసం తీసుకువచ్చింది.ఇప్పటివరకు కేవలం మెసేజ్, ఆడియో, వీడియో కాల్స్ మాత్రమే పరిమితమైన వాట్సప్ ఇప్పుడు ఏకంగా సరికొత్త AI ఫీచర్ ని  సైతం తీసుకువచ్చింది. ఇండియాలో ఎంపిక చేసిన కొంత మంది యూజర్స్ కు ఈ ఫిచర్ కనిపిస్తోంది. అయితే అలా కనిపించిన కొద్దిసేపటికి మళ్ళీ ఈ అప్డేట్ అదృశ్యమైందట. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎక్కువగా పాపులారిటీ సంపాదిస్తున్న నేపథ్యంలో మెటా సైతం ఈ రంగంలోకి వస్తోంది.


ఇందులో భాగంగానే ఇతర కంపెనీలకు పోటీగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారితంగా..META AI రూపొందించారు. దీనిని వాట్సప్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ఫీచర్ను క్లిక్ చేయగానే ఆస్క్ మెటా ఏఐ ఎనీ థింగ్ అంటూ ఒక లోగో ఓపెన్ అవుతుందట. ఆ తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీతో చాట్ మెనూ ఓపెన్ చేస్తుంది.. ఇందులో మనకు ఏదైనా సందేహం ఉన్న అంశాన్ని కూడా అక్కడ సర్చింగ్ చేస్తే చాట్ జిపిటి తరహాలో సమాధానాలను కూడా అందిస్తుందట. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్ లో ఉందని రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా వాట్సాప్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: