ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగంతి తెలిసిందే.ఈ కరోనా వైరస్ ధాటికి కోట్లల్లో కేసులు,లక్షల్లో మరణాలు నమోదౌతున్నాయి.అయితే కరోనా ప్రపంచం మొత్తం చుట్టేసిన ఒక్క అంటార్కిటికా ఖండాన్ని మాత్రం చేరుకోలేదు. అయితే ఇప్పుడు అక్కడికి కూడా కరోనా చేరింది.దీంతో ప్రపంచాన్ని అంతా చుట్టేసిన ఏకైక మహమ్మారిగా కరోనా నిలిచింది.

ప్రపంచంలోని నాలుగో అతిపెద్ధ ఖండమైన అంటార్కిటికాలో తాజాగా కరోనా కేసులు నమోదయ్యాయి.అంటార్కిటికా ఖండం కరోనా కు దూరంగా ఉన్న దక్షణ దృవంలో కూడా ఇప్పుడు కేసులు నమోదు అయ్యాయి.అంతర్జాతీయ  మీడియాకు అందిన సమాచారం ప్రకారం అంటార్కిటికాలోని చిలీలోని ఒక రిసెర్చ్ సెంటర్ లో పనిచేస్తున్న 36 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలోని 26 మంది సైన్యానికి చెందిన వారని తెలుస్తుంది. మిగిలిన 10 మంది మెయింటనెన్స్ సిబ్బంది.

అయితే అంటార్కిటికా ప్రభుత్వం గతంలో కరోనా కట్టడి కోసం టూరిస్టుల రాకను నిసెదించిన సంగతి తెలిసిందే. అయిన కూడా కరోనా రాకను ఆ దేశ ప్రభుత్వం అపలేక పోయింది. ఇదిలా ఉండగా నవంబరు 27న చిలీ నుంచి కొన్ని వస్తువులు అంటార్కిటికా చేరుకున్నాయి. ఇదే సందర్భంలో కరనా వ్యాప్తి చెందిందని ఆ ధేశ ప్రభుత్వం వెల్లడించింది.ఇకపై అంటార్కిటికా ఖండంలో టూరిస్టుల రాకను నిషేదించి కరోనా నిబందనలను కటిన తరం చేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: