చిన్న పిల్లలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మాటలు చేష్టలు అన్ని ఎంతో క్యూట్ గా ఉంటాయి. ఇక వారం రోజులుగా ఓ పాప వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ పాప ఎంతో క్యూట్ గా మోడీకి కంప్లైంట్ చేస్తుంది.. ఇంతకి ఏమని ఇచ్చిందంటే...‘మోడీ సార్..మా లాంటి చిన్నపిల్లలకు ఇంత ఎక్కువ హోం వర్క్‌లు ఎందుకు ఇస్తున్నారు? 7 నుంచి 10వ తరగతి చదువుతున్నపిల్లలకు ఇంత హోం వర్క్‌ ఇవ్వండి కానీ మాకెందుకు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం2 వరకు క్లాస్‌లు చెబుతున్నారు. ఆ తర్వాత హోం వర్క్‌లు. సెలవులు లేవు. రెస్ట్‌ తీసుకునే టైమ్‌ కూడా లేదు. ఒకసారి ఆలోచించండి’ అంటూ భలే ముద్దుగా కంప్లైంట్‌ ఇచ్చింది ఆ చిన్నారి.ఇక దీనిపై జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా స్పందించడం జరిగింది.



‘‘ఈ ఫిర్యాదు చాలా ముద్దుగా ఉంది. ఈ విషయం గురించి విద్యా శాఖను ఆదేశించాను. 48 గంటల్లో విద్యా విధానం మీద ఓ పాలసీ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశాను. పిల్లకు హోం వర్క్‌ భారం ఎక్కువగా ఉండకుండా చూడాలి. బాల్యం అనేది దేవుడిచ్చిన వరం. దానిని ఆనందంగా అనుభవించనివ్వాలి. అనవసరమైన భారం వేసి ఇబ్బందిపెట్టకూడదు’’అని మనోజ్‌ సిన్హా సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో చూసి రిప్లై ఇవ్వడం జరిగింది.ఆ చిన్నారి చేసిన ఈ వీడియో దేశావ్యాప్తంగా పలు సోషల్ మీడియా సైట్లలో వారం నుంచి తెగ వైరల్ అవుతుంది.


ఈ వైరల్ వీడియోలో అక్షరాలా నిజం ఉంది... దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు పేరుతో గంటల తరబడి పిల్లలకు చదువు చెబుతున్నారు. ఆ వెంటనే హోం వర్క్‌ ఇచ్చేస్తున్నారు. మరోవైపు పరీక్షలు ఉంటాయో, ఉండవో తెలియడం లేదు. ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారో కూడా తెలియడం లేదు. ఈ విషయం కేవలం ఒక్క జమ్ముకశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాకుండా... మొత్తం దేశానికి పనికొచ్చేలా కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని, పటిష్టంగా అమలు చేస్తే బాగుంటుందని నిపుణుల అభిప్రాయం.





మరింత సమాచారం తెలుసుకోండి: