సాధారణంగా అత్తా కోడలు అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది.. వామ్మో అత్తాకోడళ్ల.. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఎప్పుడు ఒకరిపై ఒకరు అసూయతో ఉండడం..  లేదా ఎప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉండడం లాంటివి గుర్తొస్తూ ఉంటుంది.  అంతే కాదు అత్తా కోడళ్ళ మధ్య చివరికి భర్త బలి అవుతూ ఉండటాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. అత్తా కోడలు ఎక్కడైనా ఎంతో ప్రేమగా  ఒకరి కోసం ఒకరు ఏకంగా త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారా అంటే.. ఊరుకోండి బాసూ అత్తా కోడలు ఏంటి.. ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండడం ఏంటి.. ఇలాంటి జోకులు బాగుంటాయి అని అంటారు ఎవరైనా. అయితే అటు సినిమాల ప్రభావమో.. సీరియల్స్ ప్రభావమో తెలియదు కానీ అత్త కోడల పేరు చెబితే మాత్రం అందరూ అత్త కోడళ్ల మధ్య కలహాలు గొడవలే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే నిజజీవితంలో కూడా కొంతమంది అత్తకోడళ్ళు  ఇలాగే ఉన్నప్పటికీ అక్కడక్కడా కొంతమంది అత్తా కోడల్లు మాత్రం ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉండటం లాంటివి చూస్తూ ఉంటారు. అయితే ఇలా అత్తా కోడలు  లేదా కోడలు అత్త పై తన ప్రేమను వ్యక్తం చేయడానికి కొన్ని కొన్ని సార్లు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కోడలు ఏకంగా తన అత్త పుట్టినరోజుకు ఎవరూ ఊహించని విధంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.  ఇక అత్త కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు వినూత్నంగా ఆలోచించింది సదరు కోడలు. ఇక అత్త పై తనకున్న ప్రేమను ఈ సర్ప్రైస్ రూపంలో చూపించి ప్రస్తుతం అందరినీ ఫిదా చేస్తుంది. ఇంతకీ ఆ కోడలు అత్త పై ప్రేమను చూపించేందుకు ఏం చేసింది అని అంటారా.. సాధారణంగా ఏ కోడలైన అత్తపై ప్రేమ ఉంటే ఇక అత్త పుట్టినరోజు నాడు ఏదైనా స్పెషల్ స్వీట్ చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఇక్కడ కోడలు మాత్రం ఒక్క వంటకం కాదు ఏకంగా అత్త 60వ పుట్టిన రోజున అరవై  రకాల వంటలతో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ వంటకాలలో పులిహోర నుంచి మ్యాగీ నూడుల్స్ వరకు అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. అయితే దీనంతటికీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: