పల్లె ప్రాంతాలలో మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరు ఇటీవల గ్యాస్ ను ఉపయోగించడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రతి ఒక్కరికి నిత్యావసరం గా ఈ గ్యాస్ మారిపోయింది. అందుకే గ్యాస్ వనరులు కూడా తగ్గిపోతున్నాయి అని చెప్పవచ్చు. అయితే అట్టడుగు వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ కొనుగోలు చేసే వారిపై, సబ్సిడీలను ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటో పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ పై సబ్సిడీని నిషేధించింది అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి గ్యాస్ పై వస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నారా ..? అంటూ అడిగాడు.. ఈ విషయంపై ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది.


ఢిల్లీకి చెందినటువంటి ఒక పౌరుడు హిందీ లో ట్వీట్ చేయడం జరిగింది. అతను తన ట్విట్టర్ ద్వారా.." ఎల్పిజి గ్యాస్ పై వస్తున్న సబ్సిడీని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందా..? లేదా..? అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను.. గత 18 నెలల నుంచి నా అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా పడటం లేదు. గ్యాస్ ఏజెన్సీ వారు రాయితీగా పై సిలిండర్ పై రూ.859 అని రాయడం జరిగింది. అంటూ సీఎల్ శర్మ అనే ఒక  కస్టమర్  గ్యాస్ ఏజెన్సీ రసీదు తో పాటు పెట్రోలియం అలాగే  సహజ వాయువు @MoPNG_Seva డిపార్ట్‌మెంట్‌ రషీద్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది .


అయితే దీనికి రీట్వీట్ గా సబ్సిడీని రద్దు చేయలేదు అని తెలపడం జరిగింది. మే 2020 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఎవరి ఖాతాలో సబ్సిడీని చెల్లించడం లేదు.. దయచేసి మీలో ఎవరికై ఎల్పిజి గ్యాస్ కు సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే కస్టమర్ కేర్  011-23322395, 23322392, 23312986, 23736051, 23312996 నంబర్లకు ఉదయం  9.00 నుండి సాయంత్రం 5.00 వరకు సంప్రదించవచ్చని తెలపడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: