ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరం సోషల్ మీడియా కి అలవాటు పడిపోయి మరి ఏ ఇతర విషయాలను కూడా పట్టించుకునే పరిస్థితిలో కూడా లేకుండా ఉన్నాము. ఇక ఇందులో ముఖ్యంగా వాడే ఎటువంటి మన వాట్సాప్ కూడా ఒకటి. ఇక ఈ వాట్స్అప్ పై ఈ మధ్య కాలంలో తెగ ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాటిని నమ్మాలో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. అయితే ఇప్పుడు వాట్సప్ కు సంబంధించి ఒక తాజా ప్రకటన వెలువడింది వాటి వివరాలు చూద్దాం.

ఇక అసలు విషయానికి వస్తే.. రాత్రి సమయాలలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నామని అన్నట్లుగా కేంద్రం తెలిపిందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అది కూడా రాత్రి 11:30 నుండి మరల ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తుంది అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని ఒక వార్త బాగా పాపులర్ అయింది సోషల్ మీడియాలో. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దానిమీద తగిన సమాచారాన్ని విడుదల చేసింది.

ఇక వాట్సాప్ సేవలను రాత్రిపూట నిలిపివేస్తుంది అన్నట్లుగా వార్తలు రావడంతోపాటు గా.. తిరిగి మనం వాట్సాప్ వాడుకోవాలంటే అందుకు నెలవారి చార్జీలు కూడా ముట్ట చెప్పవలసి ఉంటుందని ఒక న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఈ వార్తలన్నీ ఒట్టి ఫేక్ అని తీసి పారేసింది.

అయితే ఇలాంటి వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ వార్తలలో నిజం లేదంటూ ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అనే పిట్టల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఇలాంటి వార్తలు అని ప్రజలు అసలు నమ్మవద్దని తెలియజేస్తోంది. అయితే ఈ వార్తలు చదివిన వారు తిరిగి ఫార్వర్డ్ చేయడం వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ముందు ఈ వార్తలు నిజమో కాదో తెలుసుకోని షేర్ చేయండి అంటూ తెలుపుతున్నది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: