73 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2022 వ సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.. 17 మందికి పద్మభూషణ్, 101 మందికి పద్మశ్రీ, నలుగురికి పద్మవిభూషణ్ అవార్డులు కూడా లభించడం సంతోషకరమని చెప్పాలి.. రాష్ట్రాలవారీగా ఈ పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం కూడా జరిగింది. ఇక ఎవరెవరు రెండు తెలుగు రాష్ట్రాలకి చెందినవారు పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్నారో మనం తెలుసుకుందాం..

ఆంధ్ర ప్రదేశ్:
1. గరికపాటి నరసింహారావు:
ప్రవచనాలు చెబుతూ అందరికీ ఎంతో జ్ఞానాన్ని పంచిన ఈయన నేడు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు.

2. గోసవీడు షేక్ హాసన్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈయన పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు.

3. డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈయన కూడా పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.

తెలంగాణ:
1. కిన్నెర మొగులయ్య:
12 మెట్ల కిన్నెర వాయిద్యం కళాకారుడిగా ఆఖరి తరం కళాకారుడు కిన్నెర మొగులయ్య ను కూడా పద్మశ్రీ పురస్కారం వరించింది.

2. రామచంద్రయ్య:
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు.

3. పద్మజా రెడ్డి:
తెలంగాణకు చెందిన పద్మజారెడ్డి పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు..

ఇకపోతే బిపిన్ రావత్ కు మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ కి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక ఈయనతోపాటు టెక్ దిగ్గజం సంస్థలైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అలాగే , కొవిషీల్డ్  టీకాను తయారుచేసిన సీరమ్ సంస్థ వ్యవస్థాపకులు అయినటువంటి సైరస్ పునావాలా  కు పద్మభూషణ్ అవార్డులు లభించాయి. కోవాగ్జిన్ టీకా ను  అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సి.ఎం.డి కృష్ణ ఎల్ల తో పాటు జే ఎం డి సుచిత్ర ఎల్ల కు వాణిజ్య , పరిశ్రమల విభాగంలో పద్మభూషణ్ అవార్డు లభించింది..

వీరితో పాటు టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా, ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ కు పద్మశ్రీ అవార్డు లభించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: