సంసారం ఒక సముద్రం లాంటిది.. అది ఈదిన కూడా ఇంకా వస్తుంది.. అందుకే అంటారు పెద్దలు సంసారం అంటే ఓర్పు, సమన్వయము అవసరం అది లేకుంటే నిత్యం గొడవలు రావడం కామన్.. వాటిని ప్రేమతో చూసుకోవాలి.. అప్పుడే గొడవలు తగ్గి కాపురం సాఫిగా సాగిపొతుంది.ఇద్దరు ఆ విషయంలో కొంచెం సర్దుకుపోతేనే సంసారం సాగుతుంది. కానీ జీవిత భాగస్వామితో గొడవ పడితే ఎంత దూరం వరకు ఆ తగాదాను లాక్కెళ్లవచ్చు.. ఇంకా ఎకువైతే ఒకరిపై మరొకరు కోపాన్ని చూపించుకోవడం జరుగుతుంది..


విషయాన్నికొస్తే.. ఓ భార్య భర్తను వేలం పెట్టింది.. తన మీద కోపంతో ఇలా చేసింది ఇది నిజంగా షాక్ ఇస్తుంది కదా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ ఘటన న్యూజిలాండ్ లో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే..జాన్‌ మెక్‌అలిస్టర్‌ అనే వ్యక్తి తీరుతో విసిగిపొయిన భార్య ఆన్ లైన్ లో అమ్మాకానికి పెట్టింది.సత్యం కోసం హరిశ్చంద్రుడు తన భార్య చంద్రమతిని అమ్మిన విషయం అందరికి తెలుసు. ఇక భర్తను ఆన్ లైన్ లో పెట్టిన మొదటి మహిళ ఈమె అయ్యి ఉంటుంది.


మొగుడిని వేలానికి పెట్టిన ఆ మహా ఇల్లాలి పేరులిండా మెక్‌ అలిస్టర్‌. ఐర్లాండ్ జాతీయురాలు. ఈమె న్యూజిలాండ్‌లో జాన్‌, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఇంతకీ ఈమె మొగడిని వేలానికి ఎందుకు పెట్టిందంటే అతను ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి చేపలు పట్టడానికి వెళ్లాడు. అదే అక్కడ సమస్య..వామ్మో ఇందుకే వెళ్లిందా అనే సందేహం రావడం సహజం.వేలం పాడేవారిని ఆకట్టుకునేందుకు భర్త గురించి డిస్‌క్రిప్షన్‌ బాగానే రాసింది. తిండి, నీళ్లు సమకూర్చితే విశ్వాసంతో ఉంటాడని రాసింది. ఆమె వెలానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందని కొన్ని గంటలకే ఆ వేలం ప్రకటనను ఆ వెబ్‌సైట్‌ తొలగించింది.. మొత్తానికి అది ఇప్పుడు వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: