గత ఏడాది ఆగస్టు నెలలో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.. ప్రముఖ నిందితుడు కెల్విన్ తో టాలీవుడ్ సినీ తారలకు సంబంధం ఉందని పూరి జగన్నాథ్ మొదలుకొని రకుల్ ప్రీతిసింగ్, చార్మి వంటి వారిని కూడా ఈడీ అధికారులు విచారించడం జరిగింది.. అయితే చాలామంది ఈ డి ఎంక్వయిరీ లో పాల్గొని చివరికి తాము నిందితులము కామని నిరూపించుకున్నారు.. సెప్టెంబర్ చివరి వారంలో అధికారులు సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా తెలంగాణలో మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది.

పూర్తి వివరాలకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ కు మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది.. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు లేఖ రాయడంతో సాక్షులు, డిజిటల్ రికార్డులు ,కాల్ డేటా ,నిందితుల వాంగ్మూలం ఇలా అన్ని వివరాలను తెలియజేయాలి అని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.. కాకపోతే కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారు అని .. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ తో లావాదేవీలు కూడా జరిపారు అన్న ఆరోపణలపై గత కొన్ని నెలల నుంచి విచారణ జరుపుతోంది.. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ ను ఈడీ కోరడం జరిగింది.

అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంలో హైకోర్టు అడిగిన వివరాల మేరకు ఈ డి ఎక్సైజ్ శాఖ ను కోరడం జరిగింది.. ఇకపోతే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను వివరాలను ఇవ్వట్లేదని హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఇలాంటి నిర్ణయం హైకోర్టు తీసుకున్నట్లు సమాచారం. అయితే గతంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులకు పూర్తి మద్దతు ఇవ్వాలని హైకోర్టు తెలిపిన వారు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చినట్లు సమాచారం.. ఇకపోతే ఈ డ్రగ్స్ కేసులో మళ్లీ ఎవరెవరిని నిందితులుగా భావిస్తారో లేక విచారణ నిర్వహిస్తారో  తెలియాలంటే మరికొద్ది రోజులు..

మరింత సమాచారం తెలుసుకోండి: