సాధారణంగా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఒక మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ పెళ్ళిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే పెద్దలు చెప్పినట్లుగా సాంప్రదాయబద్ధంగా జరిగేవి. మరి ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా జరగడం లేదా అంటే.. సాంప్రదాయ బద్ధంగానే జరుగుతున్నాయి కానీ సరికొత్త ట్రెండ్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నేటి రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నా వధూవరులు కాస్త కొత్తగా ట్రై చేసి తన పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకుంటున్నారు అనే చెప్పాలి.


 ఇలా వధూవరులు పెళ్లి కోసం  సరి కొత్తగా ట్రై చేస్తున్నా విషయాలు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో పెళ్లిలలో వధువు వరుడు డాన్స్ లు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే. అదిరిపోయే డాన్సులు చేస్తూ పెళ్లి మండపానికి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మరికొంతమంది ఖరీదైన కార్లలో ఎంట్రీ ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా గుర్రాలపై ఎంట్రీ ఇస్తూ మరింత సరికొత్తగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక పెళ్లి కూతురు మాత్రండిఫరెంట్ గా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనుకుందో ఏమో.. ఖరీదైన కార్లను వదిలేసి ఏకంగా ట్రాక్టర్ పై పెళ్లి మండపానికి వచ్చేసింది.


 మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బేతుల్ జిల్లా జావ్ర గ్రామానికి చెందిన భారతి అనే యువతి సమీప గ్రామానికి చెందిన యువకుడుతో వివాహానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇటీవలే వివాహం జరుగగా.. మండపానికి వధువు ఆసక్తికర రీతిలో ఎంట్రీ ఇచ్చింది. సోదరులిద్దరూ ఇరువైపులా కూర్చుని ఉండగా వధువు భారతి ట్రాక్టర్ నడుపుకుంటూ వివాహ వేదిక వద్దకు చేరుకుంది. అంతేకాదు నల్ల కళ్ళజోడు ధరించి ఎంతో ట్రేండి గా కనిపించింది. వధువు ఎంట్రీతో అక్కడున్న వారందరూ షాక్ లో మునిగిపోయారు. అందరి కంటే కాస్త డిఫరెంట్ గా ట్రై చేసేందుకు ఇలా ట్రాక్టర్ పై వచ్చినట్లు వధువు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: