వర్షాకాలం కావడంతో విష సర్పాలు ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరు కాస్త జాగ్రత్తగానే ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో విష సర్పాలు ఏకంగా జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరి పేరెంట్స్ వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ఒక విద్యార్థిని బ్యాగులో బుసలు కొట్టే నాగుపాము ఉండడం సంచలనంగా మారిపోయింది.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. తన బ్యాగులో ఏదో కదులుతూ సౌండ్ చేస్తుంది అని విద్యార్థిని గమనించి ఉపాధ్యాయులకు చెప్పింది. ఈ క్రమంలోని ఉపాధ్యాయులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. విద్యార్థులు అందరిని కూడా ఆ బ్యాగ్ నుంచి దూరంగా జరిపారు. చివరికి ఆ బ్యాగ్ బయటకు తీసుకువచ్చి చూస్తే అందులో ఉంది చూసి అందరూ షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్ లోని షాజ్పూర్లో బడోని స్కూల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఉమా రజాక్ అనే పదవ తరగతి విద్యార్థి తన బ్యాగ్ లో ఏదో మెదులుతున్నట్టు అనిపించడంతో టీచర్కు చెప్పింది. టీచర్ స్కూల్ బ్యాగ్ ని పూర్తిగా క్లోజ్ చేసి ఇక బయటికి తీసుకువెళ్లాడు. ఇక మెల్లగా బ్యాగ్ ఓపెన్ చేసి చూసాడు. చివరికి ఆ బ్యాగును తలకిందులుగా చేసి దులుపుగా ఒక్కసారిగా అందులోనుంచి నల్లటి కలర్లో ఉన్న త్రాచుపాము బయటపడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉపాధ్యాయులు భయపడిపోయారు. ఇక బ్యాగు నుంచి బయటపడిన పాము ఎవరిపై దాడి చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఇది చూసి తృటిలో ప్రమాదం తప్పింది కదా అని ఊపిరి పీల్చుకున్నారు అక్కడున్నవారు..

మరింత సమాచారం తెలుసుకోండి: