ఇటీవల కాలంలో మనుషులు జంతువులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా వాటి ఆవాసాల్లోకి వెళ్లి వీడియోలు ఫోటోలు తీయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఇలాంటివి చేస్తున్న సమయంలో అసలు పులులు సింహాలు అంటే వీరికి భయం వేయదా? అంత దగ్గరగా వెళ్లి ఎలా ఫోటోలు వీడియోలు తీస్తారు అని అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు సింహాలు పులులు లాంటి క్రూరమైన జంతువుల సఫారీలలోకి వెళ్లే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లను చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటాయి.


 మరి కొన్నిసార్లు మాత్రం ఏకంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా క్రూర మృగాలు తమ వైపుకు దూసుకు వచ్చి గాయపరచాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే సఫారీ వ్యూ కోసం కొంతమంది పర్యాటకులు వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక పెద్ద పులి ఏకంగా వారిపై దాడి చేయడానికి వచ్చింది. వారి వాహనం పైపు దూసుకు వచ్చి ఒక్కసారిగా ప్రాణాలు పోయాయి అనేంతలా భయాన్ని కలిగించింది.


 పొదల మాటున పెద్ద పులి ఉంది అన్న విషయాన్ని గ్రహించిన జీప్ డ్రైవర్ అక్కడే ఆ వాహనాన్ని ఆపేసాడు. ఈ క్రమంలోనే ఆ పులి బయటకి వస్తుంది  ఫోటోలు వీడియోలు తీద్దామని అందరూ ఎదురు చూసారు. కానీ ఎంతకీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో ఆ పులికి చెర్రేత్తుకొచ్చింది. దీంతో ఏకంగా గాండ్రిస్తూ ఉగ్రంగా ఒకసారిగా బయటికి తీసుకొచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా వణికిపోయారు. ఏకంగా వీడియోలు ఫోటోలు కోసం మనం చూపించే ఆత్రుత.. ఏకంగా వాటి జీవితంలోకి చొరబడటం లాంటిదే అని కొంతమంది ఈ వీడియో చూసి కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: