వైరల్ వీడియోలకు అడ్డాగా మారిన సోషల్ మీడియా లో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని చూడడానికి ఫన్నీగా ఉంటాయి, మరికొన్ని విచిత్రం గా, కొని విడ్డురం గా ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలు చూసినపుడు మాత్రం చాలా ఉద్వేగానికి గురవుతూ ఉంటాం. ఇంకొన్ని వీడియోలు చూసినపుడు ఆహా! కలికాలం అని మనసు లో అనిపిస్తుంది. తాజాగా అలా అనిపించేలా చేసింది ఒక వీడియో. ఈమధ్య కాలం లో చూసుకుంటే జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ గా వైరల్ కావడం చూస్తూ వున్నాం.

ప్రకృతి లో ఒక జంతువు మీద మరొక జంతువు దాడి చేయడం అనేది సహజం. అందులోనూ చిన్న చిన్న ప్రాణులపైన పెద్ద జంతువులు దాడి చేయడం చాలా సాధారణమైన విషయం. అయితే అదే పెద్ద జంతువులపైన చిన్న చిన్న ప్రాణులు దాడి చేస్తే ఎలాగుంటుంది... ఆహా కలికాలం అని అనకతప్పదు. ఇక్కడ వీడియోలో చూస్తే ఓ పాము పిల్లిని టార్గెట్ చేయడం చూడవచ్చు. పాముని చూసి పిల్లి ఒక ఆట ఆడుకోవాలని చూసింది. కానీ పిల్లి మామ పప్పులు వుండకలేదు. పాము చేతి లో భంగ పడింది. పాము ఎదురు తిరగడం చూసి అవాక్కయింది. అయితే సెకెన్ల వ్యవధి లో తేరుకొని పాము తలపై ఠపీమని రెండు ఇచ్చింది.

దాంతో ఆ పాముకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్టైంది. కాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వియర్డ్ అండ్ టెర్రీఫయింగ్ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేయగా దానిని అనేకమంది చూస్తున్నారు. పిల్లి చేసిన పనికి పాముకి బుద్ధి వచ్చిందని నెటిజన్లు సంబరపడిపోతున్నారు. పిల్లే కదా అనుకుంటే చంపి పాత రేస్తుందిరోయ్ అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat