అయితే సాధారణంగా ఏదో ఊరికి వెళ్లేందుకు ప్రయాణం మొదలుపెట్టిన వారికి ఇలా పిల్లి ఎదురైనప్పుడు.. ఇక వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రావడం పరవాలేదు. కానీ ఇక్కడ ఒక దొంగలు మాత్రం ఇలాంటిది గుడ్డిగా ఫాలో అయ్యారు. వాళ్ళు భారీగా నగలు నగదు దొంగతనం చేశారు. పోలీసులకు దొరక్కుండా పారిపోతున్నారు. ఇంతలో వారికి రోడ్డుపై ఒక పిల్లి ఎదురయింది. ఇంకేముంది పిల్లి ఎదురయిందంటే అశుభమని భావించి అక్కడే ఆగిపోయారు. పోలీసులు ఊరుకుంటారా వారిని వచ్చి అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఈ వింత ఘటన జరిగింది. దొంగల ముఠా ఝాన్సీలో చెలరేగిపోయింది. పలు దొంగతనాలకు పాల్పడింది. ఈ క్రమంలోనే ముఠాను పట్టుకోవడం కోసం పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఒక చోట దొంగతనానికి పాల్పడిన దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఒక పిల్లి వారికి ఎదురయింది. దీంతో అపశకునం అని భావించి అక్కడే పారిపోకుండా కొంతసేపు ఆగారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. ఇక ఈ ముగ్గురు కూడా మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వారి దగ్గర నుంచి భారీగా డబ్బు నగలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అలా రోడ్డు మీద ఎందుకు సడన్గా ఆగిపోయారు అని పోలీసులు ప్రశ్నిస్తే పిల్లి ఎదురుగా రావడంతోనే అశుభం అని భావించి పారిపోకుండా అక్కడే ఉన్నట్టు దొంగలు చెప్పడం చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి