ఛతిస్ గడ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది.. పికప్ వాహనం అదుపుతప్పి లోయలో పడినట్టుగా తెలుస్తోంది.  ఈ ఘటనలో ఏకంగా 18 మంది మరణించారు.. ముఖ్యంగా మృతులలో 14 మంది మహిళలు ఉన్నారట.మరో నలుగురికి తీవ్రమైన గాయాలైనట్లుగా సమాచారం. కుక్ దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బహపాని గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ గిరిజన తెగకు చెందినవారు 25 నుంచి 30 మంది అడవి నుంచి ఆకులు సేకరించుకొని వస్తూ ఉండగా వారు ప్రయాణిస్తున్న ఈ వాహనం బోల్తా పడినట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా వారు ప్రయాణిస్తున్నటువంటి దారి మలుపులు ఉండడం చేత అదుపుతప్పి సుమారుగా 20 అడుగుల లోయలో వివాహం పడినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి క్షతగాత్రులను కూడా తరలించారు.. కొంత మంది అక్కడికక్కడే మరణించగా మరి కొంత మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లుగా అక్కడ పోలీసులు తెలియజేశారు. అయితే వీరంతా కూడా అక్కడ కుయ్ నివాసితులు అన్నట్లుగా పోలీసులు తెలియజేశారు.బైగా కమ్యూనిటీకి చెందిన ఈ ప్రజలు ఎక్కువగా బీడీ తయారీలో చేస్తూ ఉంటారట. వీరి జీవనం ఉపాధి కోసం  వీరు ఎండిపోయిన ఆకులను అడవులలో సేకరిస్తూ ఉంటారు. ఈ ఆకులతో బీడీలు చుట్టి వారి జీవన యొక్క ఉపాధిని గడుపుకుంటూ ఉంటారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చతిస్ గడ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ వీరి మరణానికి సంతాపం తెలియజేశారు.. అయితే గాయాలైన వారికి  కూడా మెరుగైన వైద్యం అందించాలని అక్కడ అధికారులను కూడా ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని చతిస్ గడ్  ప్రభుత్వం తెలియజేసింది. ఈ విషయం అక్కడ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది ప్రభుత్వం వీరికి సరైన రోడ్డులు అందించేలా చూడాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: