సాధారణంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఎలాంటి చిన్న గొడవలు జరిగిన కూడా వాటిని బయట పెట్టేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వల్ల అక్రమ సంబంధాలు కూడా బయటపడుతున్నాయి.ముఖ్యంగా రోడ్డు మీద ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. అప్పుడప్పుడు భార్య, భర్తలు గొడవలు కూడా రోడ్డుమీదికి వచ్చేస్తూ ఉండడమే కాకుండా హద్దులు మీరీ మరి ప్రవర్తిస్తూ ఉన్నారే. తాజాగా ఒక భర్త మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ భార్యతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.


భార్యతో గొడవపడి మరి ఆమెను మెడ పైనుంచి తలకిందులుగా వేలాడదీసిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది . పోలీసులు తెలిపిన వివరాల మేరకు  ఉత్తరప్రదేశ్లో నితిన్ సింగ్, డాలి భార్యాభర్తలు గా ఉన్నారని వీరికి వివాహమై 12 ఏళ్లు అవుతోందట. నితిన్ సింగ్ ఎక్కువగా మధ్యానికి బానిసై ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవారని దీంతో తన భార్య డాలితో ఎక్కువగా గొడవపడేవారట. అంతేకాకుండా ఆమెను ఎక్కువగా కొట్టి చిత్రహింసలు పెట్టే వారిని తెలుపుతున్నారు.


అలా ఈనెల 13వ తేదీన తాగి ఇంటికి వచ్చి మరి తన భార్యతో గొడవ పెట్టుకుని ఆ గొడవను పెద్దది చేయడంతో ఈ నేపథ్యంలోనే నితిన్ తన భార్య పైన చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇంటి మేడ పైకి తీసుకువెళ్లి మరి అక్కడి నుంచి తలకిందులుగా వేలాడ తీశారు అంటూ అధికారులు తెలుపుతున్నారు. దీంతో అలా ఆమె ఐదు నిమిషాల పాటు అలాగే ఉండిపోయిందని.. చివరికి భయంతో డాలి కేకలు వేయక అరుపులు విన్న ఇంటిపక్కవారు వచ్చి అతి కష్టం మీద ఆమెను కిందికి దించారు. ఈ సంఘటన పోలీసులకు తెలియజేయడంతో నిందితుడుతో పాటు అతను కుటుంబ సభ్యుల పైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో పలువురి నెటిజెన్స్ తిట్టిపోస్తున్నారు.. ఇలాంటి వారిని శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: