ఈ వీడియో చూశాక కచ్చితంగా ఇక్కడున్న వ్యక్తిని అసలు మనిషి అని అనరు . ఎవ్వరైనా సరే వీడు మనిషా ..? మృగమా..? కళ్ళు నెత్తికెక్కయ్యా  రా..? వెధవ..?  సిగ్గులేనోడా..? ఇలానే తిడుతూ ఉంటారు . ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అదే చేస్తున్నారు . అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారిని పైకి ఎత్తుకొని పిచ్చికుక్కల నేలకేసి బలంగా కొట్టాడు . అసలు ఈ వీడియో చూస్తుంటేనే వాడిని అడ్డంగా నరికి పోగులు పెట్టాలి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు .


సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది . ప్రతి ఒక్కరు  ఈ వీడియో చూసిన వాడిపై కామెంట్స్ చేస్తున్నారు.  వీడు మనిషే కాదు అని నరరూప రాక్షసుడు అని ఘాటుఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు . కాగా ఈ ఘోర విషాదకర ఘటన మాస్కోలోని షేరెమెట్యోవో లో చోటుచేసుకుంది . ఎయిర్ పోర్ట్ లోని   రాకపోకల హాలులో ఒక వ్యక్తి ఇరానీయన్ బాలుడిని ఎత్తుకొని నేలకేసి గట్టిగా కొట్టాడు . దీంతో ఆ చిన్నారి తల పగిలిపోయింది.



అంతేకాదు వెన్నెముకకు పూర్తిగా డ్యామేజ్  ప్రస్తుతం ఆ బాబు కోమాలో ఉన్నాడు . ఆ పిల్లవాడు ఇటీవల తన తల్లితో కలిసి రష్యా కి వచ్చాడు. ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బాంబుల దాడి నుంచి తప్పించుకునేందుకు రష్యాకి వచ్చేసింది ఆ ఫ్యామిలీ . అయితే సిసి టీవీ ఫుటేజ్ లో ఆ బేబి తన ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్ ని పట్టుకొని నిలుచున్నాడు.  అక్కడ సమీపంలోని ఒక వ్యక్తి ఆ చిన్నారి వద్దకు వచ్చి అటు ఇటు చూసి ఒక్కసారిగా చిన్నారిని ఎత్తి నేలకేసి టపీ టపీ అంటూ కొట్టాడు.  ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి.  వెంటనే చుట్టూ ఉన్న ప్రయాణికులు అందరూ బాలుడిని తీసుకెళ్ళిపోయారు . పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు . అసలు ఆ వ్యక్తి ఎందుకు కొట్టాడు..? అనేది తెలియ రాలేదు . అలాంటి వాడిని అడ్డంగా నరికేయాలి అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు . ఈ దాడి జాతి వివక్షతో జరిగిందా..? లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా..?  అనే దానిపై రష్యన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: