భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబంలో ప్రస్తుతం ఆందోళన వాతావరణం నెలకొంది. అంబానీ తల్లి, 90 ఏళ్ల కోకిలాబెన్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో తొందరగా ముంబైలోని ప్రముఖ HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కోకిలాబెన్ ని సాధారణ అంబులెన్స్ కాకుండా హెలికాప్టర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు రావడంతో అంబానీ కుటుంబం పరిస్థితిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


కోకిలాబెన్ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేయకపోయినా, ప్రస్తుతం ఆమెకు సీనియర్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స జరుగుతోందని చెబుతున్నారు. డాక్టర్లు ఆమె ఆరోగ్య స్థితిని నిశితంగా గమనిస్తున్నారని, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ముంబైలోని HN రిలయన్స్ హాస్పిటల్ వద్ద ఇప్పటికే భారీగా భద్రత కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలు ఆసుపత్రి దగ్గర గుమికూడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. కోకిలాబెన్ అంబానీ కుటుంబంలోనే కాకుండా భారత వ్యాపార రంగంలో ఎంతో గౌరవం పొందిన వ్యక్తి. దాదాపు తొమ్మిది దశాబ్దాల వయస్సు దాటినా కూడా, తన ఆరోగ్యాన్ని బాగానే కాపాడుకుంటూ వస్తున్నారు.

 

అయితే ఇటీవల నుంచి ఆమె ఆరోగ్య సమస్యలు మెల్లగా పెరుగుతున్నట్లు సమాచారం. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబం కావడంతో కోకిలాబెన్ ఆరోగ్యం విషమించిందనే వార్త ముంబైతో పాటు దేశవ్యాప్తంగా షాక్ కు గురి చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే #KokilabenAmbani హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు, రిలయన్స్ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కోకిలాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి బులెటిన్ కోసం మీడియా ఎదురుచూస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి, ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ ఆరోగ్యం విషమించిందన్న వార్తతో దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. ఆసుపత్రి నుంచి వచ్చే అప్డేట్స్ పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: