సౌదీలో కఠినమైన రూల్స్ అందుబాటులో ఉంటాయి. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు దాదాపు 39మంది మరణించడం దారుణం. ఇందులో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 20 మంది మహిళలు, 10 మంది చిన్నారులతో 42 మంది సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది. అయితే అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరిని మన దేశానికి పంపాలి. కానీ సౌదీ అరేబియా రూల్స్ ప్రకారం మక్కా మదీనా లేదా సౌదీ అరేబియాలో ఎక్కడైనా తీర్థయాత్ర సమయంలో మరణిస్తే వారికి సంబంధించిన డెడ్ బాడీలను అస్సలు స్వదేశానికి పంపరు. అయితే ఈ రూల్స్ ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి. 

ముఖ్యంగా హజ్ ఉమ్రాకు సంబంధించి సౌదీ అరేబియాలో స్పష్టమైన రూల్స్ గురించి యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ముందుగానే తెలియజేస్తారు. ముందుగానే ఒప్పంద పత్రంపై యాత్రికుడు మరణిస్తే తిరిగి స్వదేశానికి అప్పగించడానికి అనుమతి ఇవ్వమని రాయించుకుంటారు. దీన్ని ప్రయాణం ప్రారంభించే ముందే తెలియజేస్తుంటారు.  సౌదీ హాజ్ చట్టం ప్రకారం  మతపరమైనటువంటి తీర్థయాత్రలు భీమా ఆదారిత ప్రభుత్వ సేవలు కావు. అందువల్లే తీర్థయాత్రల సమయంలో మరణానికి సౌదీ ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందించదని ముందుగానే తెలియజేస్తుంది. ఒకవేళ అక్కడికి వచ్చే వ్యక్తులకు భారత దేశంలో ఏదైనా ప్రైవేట్ భీమా ఉంటే వారి పాలసీ, అటువంటి కేసులను కవర్ చేస్తే సహాయం అందిస్తుంది.

అంతేకాకుండా హజ్ ఉమ్రా యాత్రికులు అధికారిక ఫారంపై సంతకం చేయాలి. అయితే ఈ తీర్థయాత్ర టైంలో మదీనాలో సౌదీ రోడ్డుపై లేదా విమాన ప్రయాణంలో మరణం సంభవిస్తే ఆ వ్యక్తికి సౌదీ అరేబియాలో దహనం చేస్తామని ఈ ఫారం స్పష్టం చేస్తుంది. కుటుంబం కాని వేరే ప్రభుత్వం కానీ అభ్యంతరం వ్యక్తం చేసినా, ఆ మృతదేహాన్ని అస్సలు అప్పగించారు. ప్రస్తుతం ఈ యాత్రలో చనిపోయిన ఇండియన్స్ అందరికీ అక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ నుంచి వారి కుటుంబ సభ్యులను దహన సంస్కారాలకు తీసుకెళ్లడానికి అనుమతులు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: