ఎవరైనా ప్రథమస్థానంలో ఉండాలని కోరుకోవడాం సహజం, కానీ అందుకొరకు తపిస్తూ అనుక్షణం కృషిచేయడం కూడా చాలా ముఖ్యమని గ్రహించండి. నిజాన్ని ప్రేమిస్తూ నిజమే మాట్లాడడం, గొప్పలు చెప్పకపోవడం, అందరితో మంచిగా మసలడం, మంచి మాటతీరు అలవరచుకోవడం, విశ్లేషాత్మకంగా ఆలోచించడం అలవరచుకోవాలి. ఇవన్నీ కూడా విజయం సాధించడానికి ఉపయోగపడే మంచి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.