చాలామంది ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పనిని ప్రారంభిస్తూ ఉంటారు. కొందరు లక్ష్యాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారు. మొదట్లో చేసే పనుల్లో విజయం సాధించడం కోసం బాగానే కష్టపడినా ఆ తరువాత పనుల్లో నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. మొక్కుబడిగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. పనిపై అశ్రద్ధ వహిస్తూ ఏదో చేశాం అంటే చేశాం అన్నట్టు పనుల విషయంలో ప్రవర్తిస్తూ ఉంటారు. 
 
కొంతకాలం తరువాత ఆ పనులకు సంబంధించి వ్యతిరేక ఫలితాలు వస్తే బాధ పడుతూ ఉంటారు. జీవితంలో ఏ పనిని ప్రారంభించినా ఆ పని కోసం నూటికి నూరు శాతం శ్రమించాలి. అలా శ్రమిస్తే నుటికి 99 శాతం అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ఎవరైతే లక్ష్యం కోసం పూర్తిస్థాయిలో శ్రమించారో వారు మాత్రం నిరంతరం ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏ పనినైనా మనస్ఫూర్తితో చేస్తే మాత్రమే విజయం సొంతమవుతుంది. 
 
ఏ పనినైనా మొదలు పెట్టే ముందు ఆ పని గురించి, ఆ పని వల్ల కలిగే ఫలితాల గురించి ఆలోచించాలి. ఆ పని చేయడం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. ఆ పని చేయడానికి మనస్సు అంగీకరిస్తే మాత్రమే పనిని మొదలుపెట్టాలి. మనస్సుకు ఇష్టం లేకపోయినా పనిని మొదలుపెడితే ఆ తరువాత పని చేయడానికి ఆసక్తి రాదు. అలా చేసే పని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. 
 
మనలో మరికొంతమంది ఇతరుల మాటలను, సలహాలను నమ్మి పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఆ పనిపై నమ్మకం లేకపోయినా అవతలి వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ తరువాత తప్పు చేశామని బాధ పడుతూ ఉంటారు. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఆ పనిని మనస్ఫూర్తిగా పూర్తి చేయగలమని... ఆ పనిని సాధించగలమని నమ్మకం ఉంటే మాత్రమే ప్రారంభించాలి. అలా మనస్ఫూర్తితో పనులను ప్రారంభిస్తే ఏ పనిలోనైనా సులువుగా సక్సెస్ సొంతమవుతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: