మనము మన పిల్లలను చిన్నప్పటి నుండి వారు పెద్ద వయసు వచ్చేంతవరకు ఎంత కష్టపడిపెంచుతామో మనకు తెలిసిందే. అక్కడి వరకు ఒక విధమైన కష్టం.. మన పిల్లలు యుక్త వయస్సుకు వచ్చినప్పుడు అంతకు మించిన బాధ్యతతో పెంచవలసి ఉంటుంది.  అందుకే అంటారు యుక్త్వా వయసులో ఉన్న పిల్లల్ని పెంచడం చాలా కష్టం అని, కానీ దీనినే మీరు ఛాలెంజ్ గా తీసుకుని పెంచాలి.  అప్పుడు ఒక విషయం మీరు గుర్తించుకోవాలి, మీరు కూడా యుక్తవయస్సు నుండి వచ్చిన వారే అని. మీరు అప్పట్లో ఎలా ఉన్నాయో గుర్తించుకుని మీ పిల్లలకు దిశ నిర్దేశం చేయాలి. మీరు టీనేజ్ లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడే సమయంలో చాలా ప్రశాంతంగా ఉండడం ముఖ్యం.

అప్పుడే వారు మీరు చెప్పిన విషయాలను వినడానికి దృష్టి పెడతారు. అప్పుడు వారికి అర్ధమయ్యేలాగా రోజుకి ఏదైనా ఒక్క విషయం గురించి మాత్రమే క్షుణ్ణంగా వివరించండి. మీరు మాట్లాడిన తరువాత వారికి ఏమి అర్ధమయిందో వారి చేత చెప్పించండి. ఈ పద్దతిలో మీరు వారి ప్రవర్తనను గమనించండి మీకు ప్రత్యుత్తరం సరిగా ఇస్తున్నారా, అయితే మీ పని చాలా సులభమవుతుంది. అలా కాకుండా మీరు చెప్పిన విషయాలను సరిగా వినకుండా, భిన్నంగా ప్రవర్తిస్తే మాత్రం మీరు వారిని మార్చడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీకు కోపం వచ్చినట్లు అనిపిస్తే, ప్రత్యుత్తరం ఇవ్వడానికి ముందు కొన్ని లోతైన శ్వాసలను తీసుకోండి. ముందుగా మీరు వారితో ఎక్కువగా మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించండి.

వారు మీతో బాగా అలవాటయ్యే వరకు వారికి నచ్చిన విధంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. తరువాత మెల్ల మెల్లగా వారికి ఉపయోగపడే మాటలను వారితో చెబుతూ ఉండండి. టీనేజ్ లో వారి వయసును ప్రభావితం చేసే ఒక్కొక్క విషయం గురించి వివరిస్తూ దాని ద్వారా జరిగే చెడును గురించి తెలియచేయండి. అప్పుడు వారు అటువంటి పనులు చేయడానికి భయపడతారు. ఇలా మీరు మీ టీనేజ్ లో ఉన్న పిల్లలను చేసుకోగలిగితే ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎన్నో అఘాయిత్యాలు జరగకుండా ఎంతోమందిని కాపాడగలము. దీన్ని మీరు వీలయితే మీ పక్కింటి వారికి చెప్పండి. అలాగే కొన్ని చిన్న చిన్న సలహాల ద్వారా ఎన్నో మంచి పనులు జరుగుతాయి. పైన తెలిపిన విషయాలన్నీ మీకు నచ్చితే ఏపీహెరాల్డ్ సైట్ ను సందర్శించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: