జీవితం లో గెలుపు మరియు ఓటమి రెండూ వస్తుంటాయి పోతుంటాయి. అయితే సంతోషంగా ఉండాలి అన్నది మాత్రం ఎపుడు మన చేతిలోనే ఉంటుంది. కాలం అన్ని సార్లు కలిసి రావాలని లేదు, అలాగే సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు అలాంటప్పుడు గెలుపును చూసి పొంగిపోతే ఆ గెలుపు హడావిడి తగ్గగానే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అలాగే విజయం అందక పోయినా చాలా మంది ఏదో వారి జీవితమే కోల్పోయినట్లు భావించి కుంగిపోతుంటారు. ఈ రెండు కూడా చాలా మంది చేసే పొరపాట్లే... ఎవరైతే స్వఛ్చమైన మనసుని కలిగి వారి ఆలోచనలను నియంత్రించగలరో వారు తమ భావోద్వేగాలను కూడా కంట్రోల్ చేయగలరు. ఓటమిని అయినా సంతోషంగా అంగీకరించగలరు. అది కూడా ఒక రకంగా గొప్ప విజయమే.

అంటే సందర్భం ఏదైనా సరే ఎప్పుడూ కూడా ఖచ్చితంగా సంతోషంగానే ఉండాలి అని అనడం లేదు ఎందుకంటే మనం మనుషులు సంతోషం బాధ రెండు సమానంగా వస్తుంటాయి పోతుంటాయి. అయితే కష్టం లోనూ మనల్ని మనం సముదాయించుకోగలగాలి, ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇందుకు మీరు కొన్ని ముఖ్యమైన విసయల్ను పాటించగలిగితే ఎప్పుడూ ఒకేలా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

* మీరు బాధగా ఉన్నప్పుడు మీకు నచ్చిన వారితో కాసేపు సరదాగా మాట్లాడండి. మీకు నచ్చిన ప్లేస్ కు వెళ్లి ఒంటరిగా గడపండి. లేదా సంగీతం వినండి. ఇలా చేయడం వలన వెంటనే మీరు పుంజుకుని మీ పనులపై త్వరగా శ్రద్ద పెట్టగలరు. అలా కాకుండా వచ్చిన ఆ బాధ గురించి ఆలోచిస్తూ ఉంటే, మీ బాధ తగ్గడం కాదు కదా... ఇంకా ఎక్కువై మీ సమయాన్ని చంపేస్తుంది. కాబట్టి బాధ వచినప్పుడు అది మిమ్మల్ని కుంగదీయడం కన్నా ముందే  దాని నుండి బయట పడండి.

* ఇక సంతోషం అన్నది మీకు ఎక్కువగా తృప్తిని ఇస్తుంది. మీలో ఇంకా ఏదో చేయాలన్న తపనను కలిగిస్తుంది. అందుకే ఎప్పుడూ మీ ముఖంపై చిరునవ్వు ఉండేలా చూసుకోండి. దీని వలన మీరు ఇంకొకరికి ఒక మంచి విషయం నేర్పిన వారవుతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: