మనం ప్రతిరోజూ పదుల సంఖ్యలో సక్సెస్ స్టోరీలు వింటూ ఉంటాం. కానీ కొంతమంది సక్సెస్ స్టోరీ విన్న సమయంలో ఇది కదా నిజమైన గెలుపంటే అని అనిపిస్తుంది. అలా తన సక్సెస్ తో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన వ్యక్తులలో కోటిరెడ్డి సరిపల్లి ఒకరు. ఎంత ఎదిగినా అణువంతైనా గర్వం లేకుండా ఉద్యోగులను సైతం కుటుంబ సభ్యులలా చూసుకునే మంచి గుణం కోటిరెడ్డి సరిపల్లి సొంతమని చెప్పవచ్చు.
 
కృషి, పట్టుదలకు కోటిరెడ్డి సరిపల్లి నిలువెత్తు రూపమని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. పదో తరగతి అర్హతతో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సాధించి మైక్రోసాఫ్ట్ యాప్ ఆర్కిటెక్ట్ టీంలో పని చేసే స్థాయికి ఎదిగిన కోటిరెడ్డి సరిపల్లి ఈతరం యూత్ కు రోల్ మోడల్ అని చెప్పవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చిన్న కొలువుతో కెరీర్ మొదలుపెట్టిన కోటిరెడ్డి అమ్మ కలలను నిజం చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని గొప్ప వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.
 
నిజ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తూ కోటిరెడ్డి సరిపల్లి సత్తా చాటారు. కృష్ణా జిల్లాలోని మారుమూల పల్లెటూరులో పుట్టిన కోటిరెడ్డి ప్రపంచమే తన గురించి మాట్లాడే స్థాయికి ఎదిగారు. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నా పుట్టిన దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో భారత్ కు తిరిగి వచ్చి వేర్వేరు రంగాల్లో ఎంట్రీ ఇచ్చి వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపారవేత్తగా సైతం కోటిరెడ్డి సక్సెస్ అయ్యారు.
 
వైద్యం, టెక్నాలజీ, మీడియా రంగాలలో తన సేవల ద్వారా కోటిరెడ్డి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 750 రూపాయల తొలి జీతం అందుకున్న కోటిరెడ్డి నేడు మిలియన్ డాలర్ల సంపాదించే స్థాయిలో ఉన్నారు. ఈరోజు కోటిరెడ్డి సరిపల్లి పుట్టినరోజు కాగా ఆయన కెరీర్ పరంగా మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించి మరెంతో మందికి స్పూర్తిగా నిలవాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: