కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్: 2కప్పులు క్యారెట్: 2-3(తురుముకోవాలి)  పచ్చిమిర్చి: 4-6(చిన్నగా కట్ చేసుకోవాలి)  చెక్క: చిన్న ముక్క  లవంగాలు: 3  యాలకులు: 2  బిర్యానీ ఆకు: చిన్నది  గరం మసాలా: 1టీ స్పూను కొత్తిమీర పేస్ట్: 1 టేబుల్ స్పూను జీలకర్ర: 1టీ స్పూను ఉప్పు: రుచికి సరిపడా  నెయ్యి: 4 టేబుల్ స్పూను జీడిపప్పు పలుకలు: కొద్దిగా తయారు చేయు విధానం: ముందుగా బాస్మతి రైస్ ను శుభ్రం చేసుకొని, పొడిపొడి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, యాలకుల, బిర్యానీ ఆకు వేసి అన్నింటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. క్యారెట్ కొద్దిగా మెత్తగా వేగిన తర్వాత అందులో కొత్తిమీర పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు మీడియం మంట మీద వేయించాలి. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. రుచి చూసి ఉప్పు సరిచేసుకొని చివరగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి వేడి వేడి గా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ గీ రైస్ రెడీ  

మరింత సమాచారం తెలుసుకోండి: